పాకిస్తాన్ టెర్రర్ దేశం? అబ్బే కాదు! -బీజేపీ

పొద్దున్న లేస్తే పాకిస్తాన్ ని తిట్టని రోజంటూ బీజేపీ కి ఉండదు. భారత సరిహద్దు దాటి ఏ దేశం వెళ్లినా పాకిస్తాన్ టెర్రరిజం గురించి చెప్పకుండా మన మంత్రులు ఉండలేరు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అయితే చెప్పనే అవసరం లేదు. పాకిస్తాన్ ని టెర్రరిస్టు దేశంగా ప్రకటించాలని ఆయన ఇటీవల పలు అంతర్జాతీయ వేదికలపై డిమాండ్ చేశారు కూడా. కానీ పాక్ ని టెర్రరిస్టు దేశంగా ప్రకటించాలని కోరుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రయివేటు బిల్లును మాత్రం…

పాకిస్తాన్ పై తప్పుడు సలహాలు -ది హిందు సంపాదకీయం

(Ill-advised on Pakistan శీర్షికతో ది హిందూ ఈ రోజు సంపాదకీయం రాసింది. దానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) నరేంద్ర మోడి అసలు స్వరూపం ఏమిటి? ఎన్నికల విజయం నాటి ఆరంభ పుష్టితో ఇస్లామాబాద్ కు స్నేహ హస్తం చాచి, తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించి, ఆయనతో తమ తమ తల్లుల కోసం దుశ్శాలువలు, చీరలు ఇచ్చిపుచ్చుకున్న వ్యక్తా? లేక “సంప్రదాయ యుద్ధం చేయగల సామర్ధ్యాన్ని పాకిస్ధాన్ కోల్పోయింది.…

క్లుప్తంగా… 29.04.2012

జాతీయం ఆఫ్ఘన్ సైనిక ఉపసంహరణతో భారత్ అప్రమత్తం కావాలి ఆఫ్ఘనిస్ధాన్ మత ఛాందస సంస్ధలు భారత్ సరిహద్దుల్లో జమకూడే ప్రమాదం ఉందని భారత సైనికాధికారి ఒకరు హెచ్చరించాడు. కర్ణాకటక లో ఒక కార్యక్రమంలో మాట్లాఆడుతూ ఆయన ఈ హెచ్చరిక చేశాడు. ముఖ్యంగా అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఉపసంహరించుకున్నాక ఈ ప్రమాదం తలెట్టవచ్చని ఆయన తెలిపాడు. జమాత్ ఉద్-దావా నాయకుడు, ముంబయ్ దాడులకు బాధ్యుడుగా అనుమానిస్తున్న హఫీజ్ సయీద్ ఇటీవల చేసిన ప్రకటనను ఆయన…

ముదిరిన సి.ఐ.ఎ, ఐ.ఎస్.ఐ ల విభేధాలు, ఐ.ఎస్.ఐ ఛీఫ్ రహస్య చైనా పర్యటన

అమెరికా, పాకిస్ధాన్ ల సంబంధాలు రోజు రోజుకీ జఠిలంగా మారుతున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం సాగిన యాభై సంవత్సరాల పాటు అమెరికాకి దక్షిణాసియాలో నమ్మకమైన బంటుగా ఉంటూ వచ్చిన పాకిస్ధాన్‌తో, అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఒకవైపు ఇండియా, రష్యాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందగా, మరొక వైపు పాకిస్ధాన్, అమెరికాల మధ్య సత్సంబంధాలు అభివృద్ధి చెందాయి. స్నేహ సంబంధాలు అనడం కంటే, భారత్, పాకిస్ధాన్‌ల పాలక వర్గాలు తమ…

ఐ.ఎస్.ఐ అధిపతి అమెరికా పర్యటన విజయవంతం, బాగుపడిన ఐ.ఎస్.ఐ, సి.ఐ.ఎ ల సంబంధాలు

90 మందికి పైగా సి.ఐ.ఎ గూఢచారులను పాకిస్ధాన్ ప్రభుత్వం దేశం నుండి వెళ్ళగొట్టడంతో పాక్, అమెరికాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టిన సంగతి విదితమే. సి.ఐ.ఎ గూఢచారులను వెనక్కి పంపడంతో అమెరికా కూడా పాకిస్ధాన్ కి ఇవ్వవలసిన 800 మిలియన్ డాలర్ల సహయాన్ని నిలిపివేసింది. తమ గూఢచారులు పాకిస్ధాన్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికే అక్కడ ఉన్నారనీ, వారే లేకపోతే ఇక శిక్షణకి ఇచ్చే సొమ్ము ఇవ్వవలసిన అవసరం లేదనీ సి.ఐ.ఏ అధికారులు, సహాయం నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటన…

పాక్ విలేఖరి హత్యలో పాక్ ప్రభుత్వ హస్తం -అమెరికా మిలట్రీ అధికారి ముల్లెన్

మే నెలాఖరులో జరిగిన పాకిస్ధాన్ విలేఖరి షహజాద్ హత్యలో పాకిస్ధాన్ ప్రభుత్వంలోని కొన్ని శక్తుల హస్తం ఉందని అమెరికా మిలట్రీ ఉన్నతాధికారి మైక్ ముల్లెన్ వెల్లడించాడు. అమెరికా మిలట్రీలో ఉన్నత స్ధాయి అధికారి ఒకరు ఈ విధంగా జర్నలిస్టు హత్య కేసు విషయంలో ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. విలేఖరి హత్యలో ఐ.ఎస్.ఐ హస్తం ఉందని తాను చెప్పలేనని కూడా ఆయన అన్నాడు. విలేఖరి హత్యకు పాక్ ప్రభుత్వానికి సంబంధించిన నిర్ధిష్ట ఏజన్సీతో సంబధం ఉందనడానికి మద్దతుగా…

జర్నలిస్టు హత్యలో ఐ.ఎస్.ఐ హస్తం లేదు -పాక్ ప్రభుత్వం

ఏసియా టైమ్స్ విలేఖరి సయ్యద్ సలీమ్ షహజాద్ హత్యలో పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ హస్తం ఉందనడాన్ని పాకిస్ధాన్ ప్రభుత్వం తిరస్కరించింది. రహస్య గూఢచర్య సమాచారం విలేఖరి హత్యలో ఐ.ఎస్.ఐ ప్రత్యక్ష జోక్యం ఉందని నిరూపిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను పాక్ ఖండించింది. పాకిస్ధాన్ భద్రతా బలగాల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికే జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో భాగమే ఈ కధనాలని ఆరోపించింది. ఐ.ఎస్.ఐ కి చెందిన సీనియర్ ఉన్నాధికారులు షహజాద్ హత్యకు పురమాయించారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక…

లాడెన్ హత్య – సి.ఐ.ఏ ఇన్ఫార్మర్లను అరెస్టు చేసిన పాకిస్ధాన్ ప్రభుత్వం

లాడెన్ హత్యతో సంబంధం ఉందని భావిస్తున్న ఐదుగురు పాకిస్దానీ ఇన్ఫార్మర్లను పాకిస్ధాన్ ఇంటలిజెన్స్ సంస్ధ ఐ.ఎస్.ఐ అరెస్టు చేసింది. ఒసామా బిన్ లాడెన్ హత్య వీరిచ్చిన సమాచారం వల్లనే జరిగిందని భావిస్తున్నారు. వీరు సి.ఐ.ఏ నియమించిన గూఢచారులుగా పని చేస్తూ అబ్బోత్తాబాద్ భవనానికి జరిగే రాకపోకలపై నిఘా ఉంచి ఆ సమాచారాన్ని సి.ఐ.ఏకి చేరవేసినట్లుగా అనుమానిస్తున్నారు. లాడెన్ రక్షణ తీసుకున్న ఇంటికి దగ్గర్లోనే సి.ఐ.ఏ ఒక సేఫ్ హౌస్ ఏర్పాటు చేసుకుంది. ఆ ఇంటి ఓనర్ అరెస్టు…

తాలిబాన్, ఆల్-ఖైదా లది టెర్రరిజమా, స్వాతంత్ర్య పోరాటమా?

‘ఏసియా టైమ్స్’ ఆన్‌లైన్ ఎడిషన్‌కి సంపాదకుడుగా ఉన్న పాకిస్ధాన్ విలేఖరి సలీమ్ షాజద్ కిడ్నాప్‌కి గురై, ఆ తర్వాత దారుణంగా హత్య చేయబడ్డాడు. అతని శరీరంపై చిత్ర హింసలకు గురైన ఆనవాళ్ళు తప్ప బలమైన గాయమేదీ కనిపించలేదు. తుపాకితో కాల్చిన గుర్తులసలే లేవు. ఎటువంటి గాయాలు కనిపించకుండా చంపగల నేర్పరితనం ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు ఉందని తెలుగు ప్రజలకు తెలుసు. షాజద్ హత్య ద్వారా ఆ నేర్పరితనం ఐ.ఎస్.ఐ గూఢచారులకు కూడా ఉందని వెల్లడయ్యింది. షాజద్‌ని చంపింది…

పాకిస్ధాన్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ సంస్ధల్లోకి చొచ్చుకెళ్ళిన ఆల్-ఖైదా; విలేఖరి పరిశోధన

ఆదివారం కిడ్నాప్‌కి గురై మంగళవారం శవమై తేలిన విలేఖరి సలీం షాజద్ మరణంపై ఇపుడు అంతర్జాతీయ స్ధాయిలో దృష్టి కేంద్రీకృతమై ఉంది. షాజద్ కొన్ని రోజులుగా పాకిస్ధాన్ నౌకాదళ అధికారులతో కలిసి విస్తృతంగా సమాచారం సేకరించాడు. మే 22 న కరాచిలోని గట్టి భద్రతా ఏర్పాట్లు ఉండే నౌకాదళ స్ధావరంపై జరిగిన ఆల్-ఖైదా దాడిగురించి వివరాలు సేకరించాడు. మిలిటెంట్ల సమాచారాన్నీ సేకరించాడు. ఆయన జరిపిన పరిశోధనలో ఆల్-ఖైదా పాకిస్ధాన్ నౌకాదళంలో జొరబడిన సంగతి తెలిసింది. ఆల్-ఖైదా చొరబాటు…

ఆల్-ఖైదా, పాక్‌ నేవీ ల సంబంధాలు వెల్లడించిన పాక్ విలేఖరి దారుణ హత్య

(విలేఖరి పరిశోధన అనంతరం తన మరణానికి ముందు రాసిన ఆర్టికల్ అనువాదం దీని తర్వాత పోస్టులో చూడండి) పాకిస్తాన్ గూఢచార సంస్ధకు ఆల్-ఖైదా, తాలిబాన్ లాంటి సంస్ధలతో దగ్గరి సంబంధాలున్నాయని భారత ప్రభుత్వం చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఒసామా హత్య తర్వాత ఆరు సంవత్సరాల పాటు ఒసామా పాక్‌లో తలదాచుకోడానికి కారణం పాక్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ లతో మిలిటెంట్ సంస్ధలకు సంబంధాలుండడమే కారణమని అమెరికా కూడా ఆరోపించింది. ఆ తర్వాత పాక్ మంత్రి మిలట్రీ, ఐ.ఎస్.ఐ సంస్ధల…

పాకిస్ధాన్ సైనికాధికారులను “మోస్ట్ వాంటెడ్” జాబితాలో చేర్చిన ఇండియా

భారత ప్రభుత్వం గత మార్చి నెలలో పాకిస్ధాన్ ప్రభుత్వానికి సమర్పించిన వాంటెడ్ వ్యక్తుల జాబితాలో ప్రస్తుతం సైన్యంలో అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారి పేర్లు ఉన్న సంగతి వెల్లడయ్యింది. ఇండియా తన భూభాగంపై జరిగిన టెర్రరిస్టు దాడుల వెనక పాకిస్ధాన్ సైనికాధికారులు, మిలట్రీ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ పాత్ర ఉందని చాలా కాలంనుండి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇండియా హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి జి.కె.పిళ్ళై మార్చి నెలలో పాకిస్ధాన్ హోమ్ కార్యదర్శి ఖమర్ జమాన్ చౌదరితో…

పాకిస్తాన్ ప్రభుత్వం, ఐ.ఎస్.ఐ ల ఆదేశంతోనే ముంబై దాడులు -అమెరికా కోర్టులో హేడ్లీ, రాణాలు – 2

తన “మెమొరాండం ఒపీనియన్ అండ్ ఆర్డర్” లో కోర్టు రాణా డిఫెన్స్ వాదనను ప్రస్తావించింది. “పబ్లిక్ అధారిటీ డిఫెన్స్” కింద తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా రాణా హేడ్లీ సాక్ష్యాన్ని మద్దతుగా ప్రస్తావిస్తున్నాడని కోర్టు పేర్కొంది. అంటే పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధికి ఉండే మినహాయింపులను రాణా కోరుతున్నాడు. హేడ్లీ తన సాక్ష్యంలో ఏమేమీ ప్రస్తావించిందీ రాణాకు చెప్పినట్లు తెలపడంతో రాణాకు హేడ్లీ సాక్ష్యాన్ని డివెన్సు గా వినియోగించాడు. కోర్టు ప్రొసీడింగ్స్ వలన పాకిస్తాన్ కి…

పాకిస్తాన్ ప్రభుత్వం, ఐ.ఎస్.ఐ ల ఆదేశంతోనే ముంబై దాడులు -అమెరికా కోర్టులో హేడ్లీ, రాణాలు – 1

ముంబై లోని తాజ్ హోటల్ పై టెర్రరిస్టు దాడులు పాకిస్తాన్ ప్రభుత్వం, దాని గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ ల ఆదేశమ్ మేరకే చేశామని అమెరికా కోర్టులో నిందితులు హేడ్లీ, రాణాలు సాక్ష్యం ఇచ్చినట్లు బయటపడడంతో సంచలనానికి తెర లేచింది. ముంబై టెర్రరిస్టు దాడుల్లో తాజ్ హోటల్ లో బస చేసిన దేశ, విదేశీ అతిధులు 200 మంది వరకూ మరణించిన సంగతి విదితమే. ముంబై దాడుల్లో పట్టుబడ్డ పాకిస్తాన్ యువకుడు కసబ్ కి కోర్టు మరనశిక్ష విధించింది.…