కానరాని రికవరీ, ప్రపంచ జి.డి.పి తెగ్గోసిన ఐ.ఎం.ఎఫ్

2007-2009 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం నుండి ప్రపంచం ఇంకా బైటపడలేదని అది వాస్తవానికి నిరంతర సంక్షోభంలో తీసుకుంటోందని మార్క్సిస్టు-లెనినిస్టు విశ్లేషకులు చెప్పిన మాటలను సాక్ష్యాత్తు ఐ.ఎం.ఎఫ్ ధ్రువపరిచింది. అలవిమాలిన ఆర్ధిక ఉద్దీపనలు ప్రకటిస్తూ, అమలు చేస్తూ ప్రపంచాన్ని మాంద్యం నుండి బైటికి తేవడానికి మార్కెట్ ఎకానమీ దేశాలు, సో కాల్డ్ అభివృద్ధి చెందిన దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆర్ధిక పరిస్ధితులు లొంగిరామంటున్నాయి. మంగళవారం ఐ.ఎం.ఎఫ్ వెలువరించిన ‘వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్’ పత్రం అనేక…

ప్రశ్న: ప్రపంచ బ్యాంకు షరతులు, సబ్సిడీలు…

చందన: శేఖర్ గారూ, ద్రవ్య పెట్టుబడి వచ్చి వెళ్ళిపోవడం వల్ల వచ్చిన నస్టం ఏమిటి? దాని డబ్బు అది తీసుకునిపొతుంది. దానిస్తానంలొ కొన్నవాళ్ళ పెట్టుబడి వస్తుంది కదా? మరి ఏమిటి నస్టం. మరొ ప్రశ్న. ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పు తీసుకున్న దేశాలు దివాళా తీశాయని, సంక్షొభంలొ కూరుకపొయాయని చాలాసార్లు పేపర్లొ ,పుస్తకాలలొ చదివాను. అయితె ఎక్కడాకూడా వివరణ లేదు. అప్పుతీసుకున్న దేశం తీసుకున్న డబ్బుకు వడ్డీ, అసలు చెల్లిస్తుంటుంది. మరి ప్రపంచ బ్యాంకుకు అప్పు తీసుకున్న…

ఉక్రెయిన్ పై మొదటి వేటు వేసిన ‘పడమటి గాలి’

‘పడమటి గాలి’ ఆరోగ్యానికి మంచిది కాదని వింటుంటాం. ‘అబ్బ! పడమటిగాలి మొదలయిందిరా’ అని పెద్దవాళ్ళు అనుకుంటుండగా చిన్నప్పుడు విని ఉన్నాం. అది ప్రకృతికి సంబంధించిన వ్యవహారం. సాంస్కృతికంగా పశ్చిమ దేశాల సంస్కృతి ఎంతటి కల్లోలాలను సృష్టిస్తున్నదో ‘పడమటి గాలి’ నాటకం ద్వారా రచయిత పాటిబండ్ల ఆనందరావు గారు శక్తివంతంగా ప్రేక్షకుల ముందు ఉంచారు. ఇ.యు వైపుకి ఉక్రెయిన్ జరిగిన ఫలితంగా ఇప్పుడు అదే పడమటి గాలి, ఆ దేశాన్ని చుట్టుముడుతోంది. ప్రజల ఆర్ధిక ఆరోగ్యానికి అదెంత ప్రమాదకరమో…

ఐ.ఎం.ఎఫ్ అంటే అలిగితిమి, ఆర్.బి.ఐదీ అదే మాటాయె!

భారత ఆర్ధిక వృద్ధి రేటు అంచనాను ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు లు తగ్గించినందుకు భారత ప్రభుత్వం తీవ్ర స్ధాయిలో ఉడుక్కుంది. ఎంతగా ఉడుక్కుందంటే, అసలు ఐ.ఎం.ఎఫ్ ఆర్ధిక అంచనా పద్ధతులను మార్చిపారేయాలని మన ఆర్ధిక మంత్రి చిదంబరం నేరుగా ఐ.ఎం.ఎఫ్ (వాషింగ్టన్) సమావేశాల్లోనే డిమాండ్ చేసేంతగా. తీరా చూడబోతే మన ఆర్.బి.ఐ కూడా భారత వృద్ధి రేటును దాదాపు ప్రపంచ బ్యాంకు అంచనాకు దరిదాపుల్లోనే ఉంచింది. 2013-14 లో ఇండియా వృద్ధి రేటు 4.7 శాతం ఉంటుందని…

అమెరికా రుణం: తగిన చర్యలు తీసుకోవాలి -జి20

ఇన్నాళ్లూ ప్రపంచ దేశాలకు ఆర్ధిక వ్యవస్ధలను సవరించుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా ఇప్పుడు సరిగ్గా దానికి విరుద్ధ పరిస్ధితిని ఎదుర్కొంటోంది. వాషింగ్టన్ లో సమావేశమైన జి20 దేశాల ప్రతినిధులు ఋణ పరిమితి పెంపుదలపై తగిన చర్యలు తీసుకోక తప్పదని దాదాపు హుకుం జారీ చేసినంత పని చేశాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సవాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్ధితిలో తన స్వల్పకాలిక కోశాగార అవసరాలు తీర్చుకోడానికి వెంటనే  తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని, లేకపోతే గడ్డు పరిస్ధితి రానున్నదని జి20…

ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశంలో వెల్లడయిన ప్రపంచ ఆర్ధికశక్తుల వైరుధ్యాలు

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సంక్షోభంలో మరింతగా కూరుకుపోతున్న నేపధ్యంలో ప్రపంచ ఆర్ధిక శక్తుల మధ్య విభేదాలు క్రమంగా పెరుగుతున్నాయి. టోక్యోలో జరిగిన ఐ.ఎం.ఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకుల వార్షిక సంయుక్త సమావేశంలో ఈ విభేధాలు ప్రస్ఫుటంగా వ్యక్తం అయ్యాయి. ప్రపంచ కాబూలీ సంస్ధలయిన ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల 2012 వార్షిక సమావేశాలు జపాన్ రాజధాని టోక్యో లో అక్టోబర్ 9 నుండి 14 వరకు జరిగాయి. పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను నిర్విఘ్నంగా నెరవేరడానికి సూత్రాలు,…

అమెరికా ఆర్ధిక వృద్ధి ఆశావాహంగా లేదు -ఐ.ఎం.ఎఫ్

అమెరికా ఆర్ధిక ‘రికవరీ’ ఏమంత ప్రోత్సాహకరంగా లేదని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పేర్కొంది. 2012 సంవత్సరానికి అమెరికా జి.డి.పి వృద్ధి రేటు అంచనాని 2.1 శాతం నుండి 2 శాతానికి తగ్గించింది. యూరో జోన్ ఋణ సంక్షోభం, అమెరికా ఆర్ధిక వ్యవస్ధలోని అనిశ్చిత పరిస్ధితులు పరిస్ధితిని మరింత ప్రమాదకరంగా మార్చాయని తెలిపింది. అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాక కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టే లోపు అప్పు పరిమితిని మరోసారి పెంచాల్సి ఉందని హెచ్చరించింది. 2012 సంవత్సరానికి గాను అమెరికా…

జులై 1 కి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 315.715 బిలియన్లు

భారత దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు జూన్ 24 తో ముగిసిన వారంతో పోలిస్తే జులై 1 తో ముగిసిన వారంలో 2.17 శాతం పెరిగాయి. జూన్ 24 అన్ని రకాల విదేశీ మారక ద్రవ్య నిల్వలు మొత్తం 309.020 బిలియన్ డాలర్లు ఉండగా అది జులై 1 కి 315.715 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత రిజర్వ్ బ్యాంకు శుక్రవారం విడుదల చేసిన వారం వారీ ప్రకటనలో తెలిపింది. డాలర్లలో లెక్కించిన విదేశీ మారక…

ఆయిల్ రేట్ల భారాన్ని ప్రభుత్వం ప్రజలపై వేయాల్సిందే -అహ్లూవాలియా

ధనిక స్కూళ్ళలో చదివి, ఆక్స్‌ఫర్డ్ లోనో, హార్వర్డ్ లోనో ఉన్నత చదువులు పూర్తి చేసి, ఐ.ఎం.ఎఫ్ లాంటి ప్రపంచ వడ్డీ వ్యాపార సంస్ధల్లో ఉద్యోగం చేసినవాళ్ళని ప్రభుత్వంలో కూర్చోబెడితే ఏమవుతుంది? “నెత్తిన పేనుకు పెత్తనమిస్తే నెత్తి గొరుగురా ఒరే, ఒరే” అని ఓ కవి పాడినట్లుగానే అవుతుంది. భారత దేశ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా పరిస్ధితి కూడా అలాంటిదే. “ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినపుడు ఆ భారం ప్రజలమీద మోపడానికి…

ఐ.ఎం.ఎఫ్ పదవికి దేశం కాదు, ఏకాభిప్రాయమే ప్రాతిపదిక -ఇండియా

ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ప్రతిభ, ఏకాభిప్రాయమే ప్రాతిపదికగా ఉండాలి తప్ప జాతీయత, దేశం కాదని ఇండియా ప్రకటించింది. యూరోపియన్ దేశం నుండి మాత్రమే ఆ పదవికి ఎన్నుకోవాలని యూరోపియన్ యూనియన్ ప్రకటించడం పట్ల ఇండియా తో పాటు ఇతర బ్రిక్స్ దేశాలైన చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టీన్ లాగార్డే తాను ఐ.ఎం.ఎఫ్ అత్యున్నత పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇ.యు ఆమెకు పూర్తి…

ఐ.ఎం.ఎఫ్ పదవికోసం పశ్చిమ దేశాలు, బ్రిక్స్ దేశాలకు మధ్య పోటీ

ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డొమినిక్ స్ట్రాస్ కాన్ లైంగిక ఆరోపణలతో పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పదవి కోసం పశ్చిమ దేశాలూ, ఎమర్జింగ్ దేశాలూ పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా బ్రిక్స్ (BRICS) గ్రూపుకి చెందిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ అఫ్రికా దేశాలు ఈసారి ఎమర్జింగ్ దేశాలకు చెందినవారిని ఐ.ఎంఎఫ్ పదవికి నియమించాలని కోరుతున్నాయి. కానీ యూరప్ అప్పు సంక్షోభంలో మరిన్ని దేశాలు జారిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్నందున, సంక్షోభాన్ని సమర్ధవంతంగా…

స్ట్రాస్ కాన్ ఉదంతంతో రూల్స్‌ని సవరించుకున్న ఐ.ఎం.ఎఫ్

న్యూయార్క్ లోని ఓ లగ్జరీ హోటల్ లో ఐ.ఎం.ఎఫ్ మాజీ అధ్యక్షుడు హొటల్ మహిలా వర్కర్ పై రేప్ నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఐ.ఎం.ఎఫ్ మహిళా హింసకు సంబంధించిన నిబంధనల్లో కొన్ని కార్పులు చేసుకుంది. కొత్త రూల్ ప్రకారం మహిళలను హింస (harassment) కు గురిచేసినట్లయితే క్రమశిక్షణా చర్య తీసుకోవడంతో పాటు ఉద్యోగం నుండి  కుడా తొలగించవచ్చు. మే 6 న ఆమోదం పొందిన నిబంధనల సమీక్షను గురువారం వెల్లడించారు. 2008 సంవత్సరంలో స్ట్రాస్ కాన్…

పూర్తిస్ధాయి సంక్షోభానికి ఒకే ఒక్క షాక్ దూరంలోనే ఉన్నాం -ప్రపంచ బ్యాంకు

2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు. “పూర్తి స్ధాయి సంక్షోభానికి ఇంకొక్క షాక్ ఎదురైతే చాలు” అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్ జోల్లిక్ హెచ్చరించాడు. ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఆహారధరలు మరో తీవ్రమైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం బద్దలవడానికి ప్రధాన దోహదకారిగా పని చేస్తున్నదని రాబర్ట్ హెచ్చరించాడు. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లు వాషింగ్టన్ లో జరుపుతున్న వేసవి సమావేశాల సందర్భంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఈ…