ఐ.ఎం.ఎఫ్ పదవికోసం పశ్చిమ దేశాలు, బ్రిక్స్ దేశాలకు మధ్య పోటీ

ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డొమినిక్ స్ట్రాస్ కాన్ లైంగిక ఆరోపణలతో పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పదవి కోసం పశ్చిమ దేశాలూ, ఎమర్జింగ్ దేశాలూ పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా బ్రిక్స్ (BRICS) గ్రూపుకి చెందిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ అఫ్రికా దేశాలు ఈసారి ఎమర్జింగ్ దేశాలకు చెందినవారిని ఐ.ఎంఎఫ్ పదవికి నియమించాలని కోరుతున్నాయి. కానీ యూరప్ అప్పు సంక్షోభంలో మరిన్ని దేశాలు జారిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్నందున, సంక్షోభాన్ని సమర్ధవంతంగా…

కటకటాల కాన్

డొమినిక్ స్ట్రాస్ కాన్. మొన్నటివరకూ సంక్షోభాల్లో ఉన్న అర్ధిక వ్యవస్ధలకు బిలియన్ల డాలర్ల అప్పుల సాయం ఇవ్వడానికి నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తివంతుడు. ప్రపంచ ఆర్ధిక సంక్షొభం పరిష్కారానికి జి-20 దేశాల కూటమితో కలిసి నిరంతరం కృషి చేసి సంక్షోభంలో ఉన్న మహా మహా దేశాలను ఓ ఒడ్డుకి చేర్చడానికి దోహద పడిన మేధావి. చైనా కరెన్సీ యువాన్ విలువ పెంచాల్సిందేనని ఒత్తిడి తెచ్చి పశ్చిమ దేశాల వాదనలకు దన్నుగా నిలబడిన ధ్వజ స్తంభం. అప్పు సంక్షోభంలో కూరుకుపోయిన…

లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడు స్ట్రాస్ కాన్

చివరికి ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడు కూడా తానూ మ(మృ)గాడినే అని నిరూపించుకున్నాడు. ఫ్రాన్సు దేశీయుడు, అంతర్జాతీయ ద్రవ్య సంస్ధ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ -ఐ.ఎం.ఎఫ్) అధ్యక్షుడు ‘డొమినిక్ స్ట్రాస్ కాన్’ ఒక లగ్జరీ హోటల్ లోని మెయిడ్ పై అత్యాచారానికి పూనుకున్నాడన్న నేరంపై న్యూయార్కులోని కెన్నెడీ విమానాశ్రయంలో అరెస్టు అయ్యాడు. ఫ్రాన్సులో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ తరపున నికొలస్ సర్కోజీపై నిలబడి గెలుస్తాడని అందరూ భావిస్తున్న దశలో తాజా సంఘటన జరిగింది. 2007 నుండీ…