ఉత్తర కొరియాపై సామ్రాజ్యవాద యుద్ధ మేఘాలు?!
గత కొద్ది నెలలుగా అంతర్జాతీయ వార్తల్లో ఉత్తర కొరియా ఒక ప్రధాన అంశంగా వార్తల్లో నానుతోంది. ఈ వార్తలను ప్రధానంగా సృష్టిస్తున్నది అమెరికా, ఐరోపాలకు చెందిన బహుళజాతి కార్పొరేట్ మీడియా కంపెనీలు. కాగా ఇండియాతో సహా ఇతర మూడో ప్రపంచ దేశాలలోని చిన్నా, పెద్దా వార్తా సంస్థలన్నీ ఈ వార్తా కధనాలను క్రమం తప్పకుండా మోసి పెడుతున్నాయి. వాస్తవాల జోలికి పోకుండా అవాస్తవాలనే వాస్తవాలుగా నెత్తి మీద వేసుకుని ప్రచారం చేస్తున్నాయి. భారత దేశంలో అయితే ప్రాంతీయ…