అలెప్పోలో ఆల్-ఖైదాకు సాయం చేస్తున్న అమెరికా మిలట్రీ పట్టివేత

గత ఆరేళ్లుగా సిరియా ప్రభుత్వం చెబుతున్నదే నిజం అయింది. సిరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నది సిరియన్లు కాదనీ, సౌదీ అరేబియా, కతార్, టర్కీలు ఇతర ముస్లిం దేశాల నుండి సమీకరించిన టెర్రరిస్టులను తమ దేశంలోకి ప్రవేశపెట్టి కృత్రిమ తిరుగుబాటు సృష్టించాయని వారికి అమెరికాతో సహా వివిధ పశ్చిమ దేశాల మిలట్రీ సలహాదారులు శిక్షణ ఇస్తున్నాయని, సిరియాలో తిష్ట వేసి టెర్రరిస్టులను నడిపిస్తున్నారని సిరియా ప్రభుత్వం ఇన్నాళ్లు చెబుతూ వచ్చింది. అలెప్పో నగరంలో బంకర్లలో దాగిన అమెరికా,…

థర్డ్ వరల్డ్ వార్? -అమెరికా, రష్యాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత

  సిరియా అంతర్యుద్ధం విషయమై అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తత క్రమ క్రమంగా పెరుగుతున్నది. ఇరు దేశాలు తెర వెనుక  పరస్పరం ప్రతీకార చర్యలు తీసుకుంటున్నాయి. అగ్ర దేశాలు రెండు ఏ క్షణంలో ఏ చర్యకు పాల్పడతాయో అన్న ఆందోళనను పరిశీలకులకు కలిగిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికాయే విఫలం చేసిన నేపథ్యంలో చర్చలకు, శాంతికి ఇంకా అవకాశం మిగిలే ఉన్నదని రష్యా ప్రకటిస్తుండగా అమెరికా మాత్రం వరుస ప్రతీకార చర్యలు ప్రకటిస్తున్నది. దానితో రష్యా సైతం…

సిరియా: సహకరించు, లేదా ఇంటికి శవాలు వెళ్తాయి!

  అమెరికా దృష్టిలో తనకి సహకరించడం అంటే తాను చెప్పిన మాటల్ని / ఇచ్చిన ఆదేశాల్ని పొల్లు పోకుండా అంగీకరించి అమలు చేయడం.  సిరియా అంతర్యుద్ధంలో తనకు సహకరించాలని లేదంటే రష్యన్ సైనికుల శవాలు బాడీ బ్యాగ్స్ లో ఇంటికి పంపించాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. ఇది నేరుగా రష్యాతో కయ్యానికి కాలు దువ్వడమే.  “ఇది (అమెరికా సమర్థిస్తున్న ఉగ్రవాద గ్రూపులపై రష్యా, సిరియాలు వాయు, భూతల దాడులు చేయడం) ఇలాగే కొనసాగితే…, సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతుంది.…

సిరియా: విచక్షణ లేకుండా బాంబులు వెయ్, నింద ప్రత్యర్థి మీదికి నెట్టేయ్!

  అనుకున్నట్టే జరుగుతోంది. సిరియాలో కిరాయి తిరుగుబాటు ప్రవేశపెట్టిన దగ్గర్నుండి ఎలాంటి కుత్సిత ఎత్తుగడలనైతే అమెరికా శిబిరం అనుసరిస్తూ వస్తున్నదో ఇప్పుడూ అదే ఎత్తుగడ అమలు చేస్తున్నది. వారం రోజుల క్రితం రష్యాతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలులో లేకుండా చేయడానికి చేయవలసిందల్లా చేసి ఆ నెపాన్ని సిగ్గూ ఎగ్గూ  లేకుండా సిరియా-రష్యా శిబిరం మీదికి నెట్టివేస్తున్నది.  వారం క్రితం సిరియా విషయమై అమెరికా-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ…

నాతొ వస్తే సిగ్గుకు అర్ధం నేర్పుతా! -అమెరికాతో రష్యా రాయబారి

ఐసిస్ పురోగమనానికి వీలుగా సిరియా సైన్యంపై వైమానిక దాడులు నిర్వహించి 80 మంది వరకు ప్రభుత్వ సైనికులను బలిగొన్నందుకు అమెరికాపై సిరియా కాస్త ప్రతీకారం తీర్చుకుంది. అమెరికా వైమానిక దాడులు నిర్వహించిన డెర్ ఎజ్-జోర్ లోనే ఆకాశంలో ఎగురుతున్న అమెరికన్ గూఢచార డ్రోన్ విమానాన్ని సిరియా సైన్యం కూల్చివేసింది.  అమెరికా-రష్యాల మధ్య కొద్దీ రోజుల క్రితం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం టెర్రరిస్టు. సంస్ధల వల్ల ఉల్లంఘనకు గురవుతుందని అందరూ భావిస్తుండగా అమెరికాయే ఒప్పందాన్ని అడ్డంగా ఉల్లంఘిస్తూ…

ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ కూల్చిన సిరియా సైన్యం

సిరియాలో ఐసిస్, ఆల్-నుస్రా టెర్రరిస్టుల తరపున ఇజ్రాయెల్  కూడా యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తేటతెల్లం అయింది. ఇజ్రాయెల్-సిరియా సరిహద్దులో సిరియా బలగాలపై ఫైటర్ జెట్ విమానాలతో బాంబు దాడులు నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని సిరియా బలగాలు కూల్చివేశాయి. దానితో మధ్య ప్రాచ్యంలో టెర్రరిస్టు సంస్ధలు జరుపుతున్న దాడులకు ఇజ్రాయెల్ మద్దతు ఉన్నట్లు స్పష్టం అయింది.  కూల్చివేతను ఇజ్రాయెల్ నిరాకరించింది. కానీ సిరియా బలగాలపై తమ యుద్ధ విమానాలు బాంబు దాడులు చేసిన సంగతిని మాత్రం ఆ…