ఆస్ట్రేలియా గూఢచర్యం: రాయబారిని వెనక్కి పిలిచిన ఇండోనేషియా

అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు సాగిస్తున్న గూఢచర్యం పై ఎలా స్పందించాలో ఇండోనేషియా ఒక ఉదాహరణ చూపింది. తమ అధ్యక్షుడి టెలిఫోన్ సంభాషణలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిఘా పెట్టిందన్న విషయం స్నోడెన్ పత్రాల ద్వారా వెలుగులోకి వచ్చిన రోజే ఆ దేశం నుండి తమ రాయబారిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాతో తాము కుదుర్చుకున్న స్నేహ, సహకార ఒప్పందాలు అన్నింటినీ సమీక్షిస్తున్నట్లు కూడా ఇండోనేషియా ప్రకటించింది. అమెరికా గూఢచర్యం అసలు గూఢచర్యమే కాదు పొమ్మన్న భారత పాలకులతో…

ఉగ్రవాదం కాదు స్వార్ధం కోసమే అమెరికా గూఢచర్యం -బ్రెజిల్

ప్రపంచంలో ఉగ్రవాద ప్రమాదాన్ని అరికట్టడానికే తాను ప్రపంచ ప్రజలందరిపైనా గూఢచర్యం సాగిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పుకున్నాడు. వాస్తవంలో అమెరికా బహుళజాతి కంపెనీల వాణిజ్య, ఆర్ధిక ప్రయోజనాల కోసమే అమెరికన్ ఎన్.ఎస్.ఏ గూఢచర్యం జరుగుతోందని తాజా స్నోడెన్ పత్రాలు స్పష్టం చేశాయి. అమెరికాతో పాటు కెనడా కూడా ఈ గూఢచర్యంలో భాగం పంచుకుందని, ముఖ్యంగా బ్రెజిల్ లోని మైనింగ్ పరిశ్రమలో తమ కంపెనీల ప్రయోజనాల కోసం ఎన్.ఎస్.ఏ గూఢచర్యాన్ని కెనడా వినియోగించుకుందని బ్రిటిష్ పత్రిక ది గార్డియన్…