పైచేయి సాధించిన గడ్డాఫీ, ‘నో-ఫ్లై జోన్’ అమలుకు భద్రతా సమితి ఓటింగ్

లిబియా తిరుగుబాటుదారుల పై గడ్డాఫీ పైచేయి కొనసాగుతోంది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు లిబియాకు ముఖద్వారంగా చెప్పుకోదగిన ‘అజ్దాబియా’ పట్టణం కోసం ఇరుపక్షాల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. పట్టణాన్ని గడ్డాఫీ బలగాలు మూడువైపుల నుండి చుట్టుముట్టాయి. తూర్పు లిబియాలో అతి పెద్ద పట్టణం, లిబియాలో ట్రిపోలి తర్వాత అతి పెద్ద పట్టణం అయిన బెంఘాజీకి అజ్దాబియా 160 కి.మీ దూరంలో ఉంది. రెడ్ క్రాస్ సంస్ధ సిబ్బంది భద్రతా కారణాలను చూపుతూ బుధవారం బెంఘాజీ నుండి…

భారతీయ నటి నటించిన “మిరాల్” ప్రీవ్యూని రద్దు చేయాలి -ఇజ్రాయెల్ డిమాండ్

“స్లమ్ డాగ్ మిలియన్” చిత్రంలో నటించిన భారతీయ నటి “ఫ్రీదా పింటో” నటించిన మరో హాలీవుడ్ సినిమా “మిరాల్” ప్రీవ్యూను ఐక్యరాజ్యసమితి లోని జనరల్ అసెంబ్లీ హాలులో ప్రదర్శించడానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది. “మిరాల్”  పాలస్తీనా, ఇజ్రాయెల్ వైరానికి సంబంధించిన చిత్రం. ఐక్యరాజ్యసమితి కేంద్ర భవనం న్యూయార్క్ లోఉంది. జనరల్ అసెంబ్లీ హాలును సినిమాల ప్రివ్యూలకు అనుమతించడం ఎప్పటినుండో జరుగుతూ వస్తున్నది. “మిరాల్” సినిమాను అనుమతించడం ఐక్యరాజ్య సమితి తీసుకున్న “రాజకీయ…

సిగ్గూ, లజ్జా వదిలేసిన అమెరికా, ఐక్యరాజ్యసమితిలో మరో సారి నవ్వుల పాలు

  పాపాల పుట్ట అమెరికా తాను సిగ్గూ, లజ్జా ఎప్పుడో వదిలేశానని మరోసారి ఋజువు చేసుకుంది. తాను నిత్యం వల్లించే విలువలూ, సూత్రాలూ తనకు ఏ మాత్రం వర్తించవని ప్రపంచ వేదిక ఐక్యరాజ్యసమితి లోనే విలువల వలువలు ఊడదీసుకుని మరీ చాటి చెప్పుకుంది. తనకు నీతీ, నియమాలు ఒక లెక్క కాదనీ, తనకు ఉపయోగం అనుకుంటే ఎన్నిసార్లు మొఖం మీద ఉమ్మేసినా తుడుచుకు పోగలననీ నిస్సిగ్గుగా ప్రకటించుకుంది. తన హీనపు బతుక్కి వేరే ఎవరూ అద్దం పట్టనవసరం…