అంతర్జాతీయ చీదరింపులు తోసిరాజని కొనసాగుతున్న ఇజ్రాయెల్ జాత్యహంకారం

“దశాబ్దాల క్రితమే హద్దులు మీరిన ఇజ్రాయెల్ జాత్యహంకారం అంతర్జాతీయ సహనాన్ని పరీక్షించడంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తన సహన పరిమితులు పెంచుకుంటూ పోవడంలో అంతర్జాతీయ సమాజం కూడా తన రికార్డులు తానే అధిగమిస్తున్నదని చెప్పడంలోనూ ఎటువంటి సందేహం లేదు.” పాలస్తీనాకు ‘పరిశీలక సభ్యేతర దేశం’ హోదాను ఇస్తూ ఐరాస జనరల్ అసెంబ్లీ అత్యధిక మెజారిటీతో తీర్మానం ఆమోదించిన మరుసటి రోజే E-1 ఏరియాలో 3000 ఇళ్లతో కొత్త సెటిల్‌మెంట్ నిర్మిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించిన సంగతిని గానీ,…

అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులను ఓడిస్తూ ఐరాసలో పాలస్తీనా -2

హమాస్ x ఫతా మహమ్మద్ అబ్బాస్ నేతృత్వంలోని ఫతా ‘పాలస్తీనా ఆధారిటీ’ పేరుతో వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని పాలిస్తుండగా, నిన్నటివరకూ డమాస్కస్ లోనూ, ఇపుడు దోహా లోనూ ఆశ్రయం పొందుతున్న ఖలేద్ మాషాల్ నేతృత్వంలోని హమాస్ గాజా ను పాలిస్తోంది. అరాఫత్ బతికి ఉన్నంతవరకూ పి.ఎల్.ఓ (పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్) కింద ఒకే నిర్మాణంలో ఉన్న ఫతా, హమాస్ లు ఆయన మరణానంతర పరిణామాల ఫలితంగా బద్ధ శత్రువులుగా మారిపోయాయి. గాజాలో ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికల్లో హమాస్ గెలిచి…

అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులను చీత్కరిస్తూ పాలస్తీనాకు ఐరాసలో స్ధానం -1

ప్రపంచ పోలీసు అమెరికా, జాత్యహంకార ఇజ్రాయెల్ ల బెదిరింపులను చీత్కరిస్తూ ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితిలో చారిత్రాత్మక తీర్పును ప్రకటించాయి. పాలస్తీనా దేశానికి ఐక్యరాజ్యసమితిలో సభ్యేతర పరిశీలక రాజ్యం (non-member observer state) గా గుర్తింపునిస్తూ ఐరాస సాధారణ సభ (General Assembly) భారీ మెజారిటీతో నిర్ణయించింది. ఐరాసకు ఇచ్చే నిధుల్లో భారీ కోత విధిస్తామనీ, పాలస్తీనాకు ఇస్తున్న సహాయాన్ని కూడా ఆపేస్తామనీ అమెరికా అత్యున్నత స్ధాయిలో తీవ్రంగా సాగించిన బెదిరింపులను ప్రపంచ దేశాలు పెడచెవిన పెట్టాయి. ప్రపంచ…

ఇంటిపనికి వేతనం ఇవ్వాల్సింది భర్త కాదు, గృహిణుల శ్రమను దోచే ఆధిపత్య వర్గ ప్రభుత్వం -2

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ట తీర్ధ ఒప్పుకోలు ఇక్కడ పరిగణిచాలి. ఆమె ఒప్పుకున్నది గనుక పరిగణించడం కాదిక్కడ. ఐరాస ఒప్పందం, సుప్రీం కోర్టు పరిశీలన, సామాజిక అధ్యయనవేత్తల లెక్కలు అన్నీ పరిగణిస్తే కృష్ట తీర్ధ ఒప్పుకోలు, పరిగణించవలసిన వాస్తవం అని గ్రహించవచ్చు. మంత్రి ఒప్పుకోలును పరిగణిస్తే భారత దేశ జి.డి.పి 2010 లో 1143 బిలియన్లు కాదు. దాని విలువ 1747 బిలియన్ డాలర్లు. ఇందులో 35 శాతం కేవలం గృహిణుల శ్రమనుండి…

ఇంటిపనికి వేతనం ఇవ్వాల్సింది భర్త కాదు, గృహిణుల శ్రమను దోచే ఆధిపత్య వర్గ ప్రభుత్వం -1

సెప్టెంబర్ మొదటివారంలో అకస్మాత్తుగా దేశ పత్రికలు, చానెళ్ళు వేతనంలేని ఇంటిపని గురించి మాట్లాడడం మొదలు పెట్టాయి. ఇంటి పని చేసినందుకుగాను భర్తల వేతనంలో కొంతభాగం భార్యలకు చెల్లించేలా చట్టం తెస్తామని కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ తీర్ధ ప్రకటించడంతో వివిధ వేదికలపైన దేశవ్యాపితంగా చర్చలు మొదలయ్యాయి. మహిళా సంఘాలు, సామాజిక శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్ధల ఎజెండాల్లోనూ, డిమాండ్లలోనూ దశాబ్దాలుగా నలుగుతున్నప్పటికీ, పత్రికల సామాజిక బాధ్యతలో మాత్రం ‘ఇంటిపని వేతనం’ పెద్దగా చోటు సంపాదించలేకపోయింది.…

మా దేశంలో రక్తపాతానికి టర్కీ ఆపాలజీ చెప్పిందా? -సిరియా

టర్కీ నుండి వచ్చిన టెర్రరిస్టుల వల్ల సంవత్సరం ఎనిమిది నెలల నుండి మా దేశ ప్రజలపై అమానుష రక్తపాతం జరుగుతున్నా తమ ప్రజలకు కనీసం సానుభూతి కూడా టర్కీ ప్రకటించలేదనీ, అలాంటిది ఏ తప్పూ చేయకుండా మమ్మల్ని ఆపాలజీ కోరడం ఏమిటని సిరియా ప్రశ్నించింది. సిరియావైపు నుండి జరిగిన దాడిలో టర్కీలో మరణించిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపాము తప్ప ఆపాలజీ చెప్పలేదని స్పష్టం చేసీంది. దాడికి ఎవరు కారకులో తెలుసుకోవడానికి…

చరిత్రాత్మక యు.ఎన్ సభలో ఇరాన్ ధిక్కరణ

అమెరికా నిధులిచ్చి నడిపే ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ అధ్యక్షుడు ‘అహ్మది నెజాద్’ చరిత్రాత్మక ప్రసంగం ఇచ్చాడు. ఇండియా లాంటి రాజ్యాలు (ప్రజలు కాదు) కలలోనైనా ఊహించని రీతిలో అమెరికా దుర్నీతిని దునుమాడాడు. మధ్యప్రాచ్యంలో ఏకైక అణ్వస్త్ర రాజ్యం ఇజ్రాయెల్ కి అండగా నిలిచే అమెరికా, అణు బాంబు వాసనే తెలియని ఇరాన్ పై దుష్ప్రచారం చేయడం ఏమిటని నిలదీశాడు. అణ్వస్త్రాలు ధరించిన ‘ఫేక్ రెజిమ్’ (ఇజ్రాయెల్) ని అమెరికా కాపాడుతోందని దుయ్యబట్టాడు. భావప్రకటనా స్వేచ్ఛను ప్రపంచ ప్రజల…

అమెరికా ఇజ్రాయెల్ వద్దన్నా సరే, ఇరాన్ అలీన సభకి వెళ్తా -బాన్

ధూర్త రాజ్యాలయిన అమెరికా, ఇజ్రాయెల్ అభ్యంతరాలను పక్కన బెట్టి, ఐక్యరాజ్య సమితి అధిపతి బాన్ కి మూన్ ఇరాన్ వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 30-31 తేదీల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో అలీన దేశాల సభ జరగనున్నది. ‘అలీనోద్యమం’ లో సభ్యులైన 119 దేశాలతో పాటు ‘పాలస్తీనా ఆధారిటీ’ కూడా ఈ సభకు హాజరుకానున్నాయి. లిబియా, సిరియా కిరాయి తిరుగుబాట్లలో దుష్ట నాటోకి అధికార ప్రతినిధి తరహాలో ప్రకటనలు ఇచ్చిన బాన్, అమెరికా ఇష్టానికి భిన్నంగా ఇరాన్…

క్లుప్తంగా… 13.05.2012

జాతీయం డబ్ల్యూ.టి.ఒ లో ఇండియా పై అమెరికా ఫిర్యాదు ప్రపంచ వాణిజ్య సంస్ధలో ఇండియాపై అమెరికా ఫిర్యాదు చేసింది. అమెరికా నుండి దిగుమతి అయ్యే కోడి మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులతో సహా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై ఇండియా విధించిన నిబంధనలు ‘వివక్ష’తో కూడి ఉన్నాయని అమెరికా ఫిర్యాదు చేసింది. ‘సానిటరీ అండ్ ఫైటో సానిటరీ’ (ఎస్.పి.ఎస్) ఒప్పందం ప్రకారం మానవుల ఆరోగ్యంతో పాటు, జంతువులు మొక్కలను కూడా కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకునే హక్కు డబ్ల్యూ.టి.ఒ సభ్య…

ఐక్యరాజ్య సమితి: సామ్రాజ్యవాది బొచ్చుకుక్క -కార్టూన్

ఐక్యరాజ్య సమితి. ప్రపంచ దేశాలను అమెరికా మాట వినేలా ఒత్తిడి తెచ్చే నమ్మకమైన రాజకీయ సంస్ధ. అమెరికా సామ్రాజ్యవాద విస్తరణకు అహరహం శ్రమించే గొప్ప సంస్ధ. పేద, బడుగు దేశాలపైన తప్ప మొరగని బొచ్చుకుక్క. కార్టూనిస్టు: విక్టర్ నీటో, వెనిజులా. —

ఆఫ్-పాక్ లతో కలసి అమెరికా వ్యతిరేక కూటమి నిర్మిస్తున్న ఇరాన్?

అమెరికా-ఇరాన్ దేశాల వైరం జగద్విదితం. ఇరాన్ అణు విధానానికి అడ్డుపడుతూ అణ్వాయుధాలు నిర్మిస్తున్నదన్న ప్రచారంతో ఆ దేశంపై ఇప్పటికి నాలుగు విడతలుగా అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలను విధింపజేసింది అమెరికా. అమెరికా నాయకత్వంలో ఇరాన్‌పై విధించిన ఆంక్షలు “వాడి పారేసిన రుమాలు”తో సమానమని ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ పశ్చిమ దేశాల అహంపై చాచి కొట్టినంత పని చేశాడు. ఆంక్షలు అమలులో ఉండగానే ఇరాన్ నేరుగా అమెరికా కంపెనీతోనే వ్యాపారం చేసి వారి ఆంక్షలను తిప్పికొట్టింది ఇరాన్. మధ్య…

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల తదుపరి టార్గెట్ సిరియా

రెండు నెలల నుండి లిబియాపై బాంబుల వర్షం కురిపిస్తూ అక్కడి మౌలిక సౌకర్యాల నన్నింటినీ సర్వ నాశనం చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు సిరియాను తమ తదుపరి లక్ష్యంగా ఎన్నుకున్నాయి. సిరియా అధ్యక్షుడు అబ్దుల్ బషర్ ను గద్దె దించేందుకు ఐక్యరాజ్యసమితిలో పావులో కదుపుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు సిరియాపై సమితి చేత తీర్మానం చేయించడానికి ఒత్తిడి పెంచుతున్నాయి. లిబియా విషయంలో కూడా బ్రిటన్, ఫ్రాన్సు లు అక్కడి ప్రభుత్వం తమ ప్రజలపై నిర్బంధం ప్రయోగిస్తున్నదని మొదట…

లిబియా తిరుగుబాటుదారులకు పశ్చిమ దేశాల మిలట్రీ ట్రైనింగ్

ఐక్యరాజ్య సమితి 1973 వ తీర్మానం ప్రకారం గడ్దాఫీ బలగాల దాడుల్లో చనిపోతున్న లిబియా పౌరులను రక్షించడానికి సమితి సభ్య దేశాలు “అవసరమైన అన్ని చర్యలూ” తీసుకోవచ్చు. దీన్ని అడ్డం పెట్టుకుని తమ సైన్యాలను బహిరంగంగా లిబియాలో దింపడానికి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్, కెనడా తదితర దేశాలకు ధైర్యం చాలడం లేదు. వారు భయపడుతున్నది గడ్దాఫీని గానీ, వారి సైనికులను చూసిగానీ కాదు. తమ సొంత ప్రజలకు అవి భయపడుతున్నాయి. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో అనేకమంది సైనికులు…

లిబియా తిరుగుబాటు సైనికుల్ని చంపినందుకు క్షమాపణ నిరాకరించిన నాటో

లిబియా ప్రభుత్వ సైనికులుగా పొరబడి తిరుగుబాటు సైనికులను చంపినందుకు క్షమాపణ చెప్పడానికి నాటొ దళాల రియర్ ఆడ్మిరల్ రస్ హార్డింగ్ నిరాకరించాడు. గురువారం అజ్దాబియా, బ్రెగా పట్టణాల మధ్య జరుగుతున్న యుద్దంలో పాల్గొనటానికి తిరుగుబాటు బలగాలు తీసుకెళ్తున్న ట్యాంకుల కాన్వాయ్ పై నాటో వైమానిక దాడులు జరపడంతో పదమూడు మంది మరణించిన సంగతి విదితమే. “గడ్డాఫీ బలగాలకు చెందిన ట్యాంకులు మిస్రాటా పట్టణంలొ పౌరులపై నేరుగా కాల్పులు జరుపుతున్నాయి. పౌరులను రక్షించడానికే మేం ప్రయత్నిస్తున్నాము. గురువారం నాటి…

మళ్ళీ పురోగమిస్తున్న గడ్డాఫీ బలగాలు, ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అతిక్రమించే దిశలో పశ్చిమ దేశాలు

గడ్డాఫీ బలగాల ధాటికి లిబియా తిరుగుబాటు బలగాలు మళ్ళీ వెనక్కి పారిపోతున్నాయి. పశ్చిమ దేశాల వైమానిక దాడుల మద్దతు లేకుండా తిరుగుబాటు బలగాలు పురోగమించడం అసాధ్యమని స్పష్టమై పోయింది. గడ్డాఫీకి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టిన పౌర సైన్యానికి శిక్షణ కొరవడడంతో తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్ని నిలబెట్టుకోలేక పోతున్నాయి. పశ్చిమ దేశాల వైమానిక దాడులతో స్వాధీనం చేసుకున్న పట్టణాలను తిరుగుబాటు దారులు వదిలిపెట్టి తూర్పువైపుకు పారిపోతున్నాయి. దీనితో ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అతిక్రమిస్తూ తిరుగుబాటు బలగాలకు ఆయుధ సాయం…