సోవియట్ రష్యాయే మెరుగు -మాజీ సోవియట్ రాజ్యాలు
USSR విచ్చిన్నం అయినప్పుడు ఎంతో మంది కమ్యూనిస్టు విద్వేషులు రాక్షసానందాన్ని అనుభవించారు. పెట్టుబడిదారీ పశ్చిమ దేశాల ప్రభుత్వాలు పండగ చేసుకోగా పశ్చిమ దేశాలను గుడ్డిగా ఆరాధించే వాళ్ళు తాము ఎందుకు ఆనందిస్తున్నామో తెలియకుండానే పిచ్చి ఆనందం పొందారు. గట్టిగా అడిగితె సోవియట్ రష్యా అంటే ‘ఇనప తెర’ అని, అక్కడ ‘వ్యక్తి స్వేచ్ఛ’ మృగ్యం అనీ, ‘నియంతృత్వ పాలన’ అనీ… ఇంకా ఇలాంటివి ఏవేవో అక్కడా ఇక్కడా విన్నవి అప్పజెపుతూ తమకే అన్ని తెలిసిపోయాయన్న ఫోజులు…