రోహిత్ నిరసనకు దారి తీసిన DU ఘటన -వీడియో

రోహిత్ వేముల ఆత్మహత్యకు దారి తీసిన పరిస్ధితుల్లో మొదటిది ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఒక ఘటన అని పత్రికలు, ఛానెళ్ల ద్వారా తెలిసిన విషయం. ఆ ఘటనకు సంబంధించిన వీడియోయే ఇది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కిరోరి మాల్ కాలేజీలో గత ముజఫర్ నగర్ మత కొట్లాటలపై ఒక డాక్యుమెంటరీ (ముజఫర్ నగర్ బాకీ హై) ప్రదర్శిస్తుండగా ఏ‌బి‌వి‌పి విద్యార్ధి సంఘం వాళ్ళు దాడి చేసి ప్రదర్శన నిలిపివేయించారు. ఆ డాక్యుమెంటరీ ‘యాంటీ నేషనల్’ అన్న ఆరోపణతో…

తప్పు లేదని నిర్ధారించినా సస్పెన్షన్ ఎందుకు?

ఏ‌ఎస్‌ఏ విద్యార్ధులు ఏ తప్పూ చేయలేదనీ, వారు తప్పు చేశారని చెప్పేందుకు ఎలాంటి సాక్షాలూ లేవని యూనివర్సిటీ నియమించిన కమిటీ నిర్ధారించింది. అయినప్పటికీ ఆ అయిదుగురినీ యూనివర్సిటీ కౌన్సిల్ ఎందుకు సస్పెండ్ చేసింది? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పి అప్పారావు నియమితులు కావడానికి ముందు నియమించబడిన కమిటీ దళిత విద్యార్ధులది ఎలాంటి తప్పూ లేదని తేల్చింది. దానితో వారిపై ఎలాంటి చర్యకూ ఆస్కారం లేదు. కనుక సస్పెన్షన్ నన్ను రద్దు చేశారు. కానీ ఆ తర్వాతే…

దళిత నిరాకరణ నేరంలో సచివులు, నేతలు!

ది హిందు సంపాదకీయం చివరలో పేర్కొన్న ‘నిరాకరణ నేరం’ అప్పుడే జరిగిపోయింది కూడా. విద్యార్ధుల ఆత్మహత్యకు తన లేఖలకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పత్రికలు, ఛానెళ్ల సాక్షిగా నిరాకరణ జారీ చేసేశారు.  ఒక్క బండారు మాత్రమే కాదు, బి‌జే‌పి జనరల్ సెక్రటరీ పి మురళీధర్ రావు ట్విట్టర్ లో రాహుల్ గాంధీ యూనివర్సిటీ సందర్శనను ఖండిస్తూ పనిలో పనిగా “రోహిత్ దళితుడు కావడానికీ, అతనిని సస్పెండ్ చేయడానికి ఎలాంటి సంబంధమూ లేదు”…