జనం చస్తే మాకేం? నాగాలాండ్ లో AFSPA పొడిగింపు

నాగాలాండ్ ప్రజలు ఏమి కోరుకున్నా తాము మాత్రం తాము అనుకున్నదే అమలు చేస్తామని మోడి ప్రభుత్వం చాటి చెప్పింది. రాష్ట్ర ప్రజలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా ‘సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని’ మరో 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో కేంద్ర ప్రభుత్వ విచక్షణపై నాగాలాండ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకం పటాపంచలైంది. నాగాలాండ్ రాష్ట్రంలో AFSPA చట్టం అమలు చేయాల్సిన అవసరం…

ఏ‌ఎఫ్‌ఎస్‌పి‌ఏ కింద శిక్షలేమికి ముగింపు -ద హిందూ ఎడిట్..

[Ending impunity under AFSPA శీర్షికన ఈ రోజు -11/07/2016- ద హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్] “జవాబుదారితనం, చట్టబద్ధ సూత్రాలకు ఒక పార్శ్వం.” విధి నిర్వహణ పేరుతో  “కల్లోలిత ప్రాంతాలలో” కూడా, భద్రతా బలగాలు పాల్పడే అతి చర్యలపై జరగవలసిన దర్యాప్తు నుండి తప్పించుకోజాలరని సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగు దరిమిలా ఈ స్థాపిత సూత్రం తాజాగా ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి నోటిఫైడ్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు తమ “ప్రత్యేక అధికారాలు” ఉపయోగించినప్పుడు చట్టబద్ధ…

స్టేషన్ల చుట్టూ తిప్పారు, తిట్టారు, కొట్టారు, ఉమ్మారు!

హంద్వారా (కాశ్మీర్) అమ్మాయి ఎట్టకేలకు నోరు విప్పింది. పోలీసులే తన చేత బలవంతంగా అబద్ధం చెప్పించారని చెప్పింది. పోలీసులు ప్రచారం చేసుకున్న వీడియోలో తాను చెప్పినది నిజం కాదని వెల్లడి చేసింది. పోలీసులు చెప్పమన్నట్లు వీడియోలో చెప్పానని తెలిపింది. ఆ వీడియో రికార్డు చేసిన జిల్లా ఎస్‌పిని వీడియోను ఎవరికి చూపవద్దని కోరానని, కానీ అదే వీడియోను ఉపయోగించి తనపై దుష్ప్రచారం చేశారని తెలిపింది. తన కూతురును నిర్బంధంలో ఉంచుకుని ఆమె చేత అబద్ధం చెప్పించారని ఆమె…

ఏ‌ఎఫ్‌ఎస్‌పి‌ఏ వెనక నక్కి చేసిన కాల్పులు -ది హిందు ఎడిట్

(కాశ్మీరు లోయలో సైనికులు కాల్పులు జరిపి కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను చంపి, మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరించిన ఘటనపై ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్) ********************** ఇద్దరు టీనేజి బాలురు చనిపోగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో క్లిష్ట పరిస్ధితిలో ఉన్నారు. చెక్ పాయింట్ వద్ద ఉన్న సైనికులు వారిని కాల్చి చంపగా జరిగిన ఘటనపై విరుద్ధ కధనాలు వినబడుతున్నాయి. కనుక అది ఎవరు చేశారన్న ప్రశ్న లేదు. ఎందుకు చేశారన్నదే ప్రశ్న.…