నేను ఏకాకిని… -కవిత

నేను ఏకాకిని జనారణ్యంలో మనుషుల్ని వెతుక్కుంతున్న జీవాన్ని మనుషుల్లో ‘మనసు’ కై దేవులాడుతున్న మానవతా పిపాసిని నటిస్తున్న నిద్రపై స్వారీ చేస్తున్న మెలకువని చచ్చిన రాకుమారుడ్ని మళ్ళీ చంపి వధ్య శిల ఎక్కనున్న చంద్రమతిని కృత్రిమత్వానికి సహజత్వానికి మధ్య దూరాన్ని కొలుస్తున్న కొలబద్దను సమూహంలో లేని సామూహికతను సమాజంలో లేని సామాజికతను కృష్ణుడిని తప్ప చూడలేని దృత రాష్ట్రుడి చూపుని కళ్ళకు గంతలు కట్టని గాంధారిని కుప్పతొట్టి బాలల కడుపు నింపుతున్న నిండు విస్తరాకుని పాలింకిన చన్నులను…