త్వరగా దయచేయండి! -ఈయు

‘బైటకు వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నారు గదా, ఇంకా ఎన్నాళ్ళు చూరు పట్టుకుని వెళ్ళాడుతారు?’ అని బ్రిటన్ / యూకె ను నిలదీసి ప్రశ్నిస్తోంది యూరోపియన్ యూనియన్. కొందరు ఈయు నేతల ప్రకటనలు చూస్తే బ్రిటన్ నేతల నాన్చుడు ధోరణి వారికి ఎంత మాత్రం ఇష్టంగా లేదని స్పష్టం అవుతోంది. “యూరోపియన్ యూనియన్ నుండి బయటకు వెళ్ళే కార్యక్రమాన్ని బ్రిటన్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలి” అని ఈయు కమిషనర్ ఒకరు హెచ్చరించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.…

అబద్ధాలాడొద్దు! -అమెరికాతో జర్మనీ

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా సెల్ ఫోన్ సంభాషణలను తాము వినడం లేదన్న అమెరికా వాదనను జర్మనీ కొట్టిపారేసింది. ‘అబద్ధాలాడొద్దు’ అని కసిరినంత పని చేసింది. తమ ఛాన్సలర్ ఫోన్ సంభాషణలను అమెరికన్లు వింటున్నారని చెప్పడానికి తమ వద్ద ‘నూతన సాక్ష్యాలు’ ఉన్నాయని తేల్చి చెప్పింది. జర్మనీ చట్టాలను ఉల్లంఘించడం లేదని చెబుతున్న ఎన్.ఎస్.ఏ వాస్తవం చెప్పడం లేదని జర్మనీ ఛాన్సలర్ వ్యవహారాల మంత్రి రొనాల్డ్ పొఫల్లా తెలిపారు. అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అనేక దేశాల అధినేతల…

ఏంజెలా ఫోన్ ట్యాపింగ్, అమెరికా రాయబారికి సమన్లు

అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సెల్ ఫోన్ ను ట్యాప్ చేసి సంభాషణలను వింటోందని జర్మనీ ఆరోపించింది. ఎన్.ఎస్.ఏ చర్యలకు వివరణ ఇవ్వాలని కోరుతూ జర్మనీ ప్రభుత్వం తమ దేశంలోని అమెరికా రాయబారికి సమన్లు పంపామని తెలిపింది. గురువారం (అక్టోబర్ 24) సాయంత్రం కలిసి వివరణ ఇవ్వాల్సిందిగా అమెరికా రాయబారి జాన్ బి.ఎమర్శన్ ను కోరామణి జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జర్మనీ ప్రకటనపై వ్యాఖ్యానించడానికి అమెరికా ఎంబసీ నిరాకరించిందని…

ప్రధాని జర్మనీ పర్యటన, ఏ రోటి కాడ ఆ పాట!

భారత ప్రధాని మన్మోహన్ ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జర్మనీ కంపెనీలు ఆతృతగా ఎదురు చూడగా అది పెద్దగా ముందుకు సాగలేదని తెలుస్తోంది. ఆరు వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని ప్రకటించాయి. సోలార్ ఎనర్జీ లాంటి సాంప్రదాయేతర ఇంధన టెక్నాలజి, విద్య, వ్యవసాయం తదితర రంగాలలో ఈ ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. ఆరేళ్లలో ఒక బిలియన్ యూరోలు రుణం ఇస్తామని హామీ ఇచ్చారుట. జర్మనీ కార్ల దిగుమతులపై అధిక పన్నులు వేయడం పట్ల…