2జి కుంభ కోణం: సుప్రీం కోర్టు తీర్పుకు అర్ధం ఏమిటి?

కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ఒక కారణంగా పని చేసిన 2జి కుంభకోణంలో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. 2011 లో మొదటి అరెస్టు జరిగిన ఈ కేసు విచారణ 6 సంవత్సరాల లోనే పూర్తి కావడం బహుశా -భారతీయ కోర్టుల సంప్రదాయం ప్రకారం- ఒక రికార్డు కావచ్చుఁ.  2008 లో కాగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన 2జి కుంభకోణం 2009 – 10 నాటికి భారీ 1.76 లక్షల కోట్ల భారీ కుంభకోణంగా దేశ ప్రజల దృష్టికి…

పార్లమెంటుకి భారీ ముప్పు -కార్టూన్

రానున్న పార్లమెంటు సమావేశాలకు మరో భారీ ముప్పు పొంచి ఉంది. బడ్జెట్ సెషన్ రెండు విడత సమావేశాలను 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం మరోసారి ముంచెత్తనుంది. కుంభకోణంపై చాసో నాయకత్వంలో ప్రభుత్వం నియమించిన జాయింట్ పార్లమెంటు కమిటీ (జె.పి.సి) తన నివేదిక ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టనుండడమే ఆ ముప్పు. అదీ కాక మిత్రుల దూరంతో బడ్జెట్ ను ఆమోదింపజేసుకోవడం కాంగ్రెస్ కు కష్టం కావచ్చు. అందుకోసం కొన్ని లొంగుబాట్లు అవసరం పడవచ్చు. స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రధాని తప్పేమీ లేదని,…

అవినీతి ‘రాజా’ కొంప ముంచిన పర్సనల్ సెక్రటరీ ‘ఆచారి’

మాజీ టెలికం మంత్రి ఎ.రాజా కు పర్సనల్ సెక్రటరీ గా పని చేసిన ‘ఆచారి’, తన మాజీ బాస్ కి వ్యతిరేకంగా కీలకమైన సాక్ష్యం చెప్పినట్లుగా ఎన్.డి.టి.వి వార్తా సంస్ధ తెలిపింది. ఎ.ఆచారి గతంలొ ఎ. రాజాకు అసిస్టెంట్ పర్సనల్ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన కోర్టులో సోమవారం మాజీ మంత్రికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఎ.రాజాకు, ఆయన కుట్ర పన్నాడని ఆరొపిస్తున్న కంపెనీల అధిపతులతో అనేక సంవత్సరాలుగా దగ్గరి సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. తద్వారా ఎ.రాజా టెలికం…

కోర్టులో మన్మోహన్, చిదంబరం పేర్లను ప్రస్తావించిన మాజీ టెలికం మంత్రి ఎ.రాజా

ఎ.రాజా. టెలికం కుంభకోణానికి కేంద్ర బిందువు. తానొక్కడే ఎందుకు బలికావాలనుకొన్నాడో ఏమో! నేరుగా ప్రధాని మన్మోహన్‌నే కోర్టుకి లాగినంతపని చేశాడు. సుప్రీం కోర్టుతో పాటు కోర్టులన్నీ ఇదే రీతిలో తన పని తాను చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మన్మోహన్ కూడా బోను ఎక్కవలసి రావచ్చు. కర్టాక టూరిజం శాఖ మంత్రి జనార్ధన రెడ్డి అక్రమ మైనింగ్ జరిపినందుకు చూస్తూ ఊరకున్న ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా బాధ్యుడే నని కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే తన నివేదికలో తేల్చాడు.…