బాధితురాలి సింగపూర్ తరలింపు రాజకీయం -డాక్టర్లు; కాదు -ప్రభుత్వం

ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారానికి గురయిన అమానత్ (అసలు పేరు కాదు) ను సింగపూర్ లోని ‘మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్’ కి తరలించాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయమే తప్ప తాము తీసుకున్న వైద్య నిర్ణయం కాదని అమానత్ కి వైద్యం చేసిన డాక్టర్లు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం వైద్యం కోసమే సింగపూర్ తరలింపు నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. బాధితురాలి ఆరోగ్యం మరింత క్షీణిస్తున్నదనీ, ఆమె శరీర అవయవాలు పని చేయడం లేదనీ, ఆమె మెదడుకు…

క్లుప్తంగా… 14.05.2012

జాతీయం పార్లమెంటుకి 60 సంవత్సరాలు భారత పార్లమెంటు సమావేశమై ఆదివారం (మే 13) తో 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశం జరిపింది. రాజ్య సభ లో ప్రధాని మన్మోహన్, లోక్ సభలో ఆర్ధిక మంత్రి ప్రణబ్ చర్చ ప్రారభించారు. పార్లమెంటులో పదే పదే అవాంఛనీయ సంఘటనలు జరగడం పట్ల ప్రధాని ఆందోళన వెలిబుచ్చాడు. “సమావేశాలకు ప్రతిరోజూ ఆటంకాలు ఎదురు కోవడం, వాయిదాలు పడడం, కేకలు వేయడం వల్ల బైటి వారికి…

ఫాలక్ తల్లి మున్నీని కాపాడిన పోలీసులు, తల్లిని చేరనున్న ఫాలక్

వళ్లంతా కొరికిన గాయాలతో, ఎముకలు విరికిన చేతులు కాళ్ళతో, గాయపడిన మెదడుతో ఢిల్లీలోని ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న రెండేళ్ల ‘ఫాలక్’ తల్లి ‘మున్నీ ఖాటూన్’ ను ఢిల్లీ పోలీసులు రాజస్ధాన్ వ్యభిచార గృహం నుండి రెండు రోజుల క్రితం రక్షించారు. మున్నీ పెద్ద కూతురు మూడేళ్ల పాపను కూడా కాపాడిన పోలీసులు తల్లీ కూతుళ్లను ఒక చోటకి చేర్చగలిగారు. అయితే మున్నీ, తన చిన్న కూతురు ఫాలక్ ను మాత్రం ఇంకా కలవ వలసి ఉంది.…

ఢిల్లీ బాలిక ‘ఫాలక్’ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు

వొళ్లంతా కొరికిన గాయాలతో పాటు, చిట్లిన కపాలం, విరిగిన కాలి, చేతి ఎముకలతో ఢిల్లీ ఆసుపత్రిలో చేరిన రెండేళ్ల పాప ‘ఫాలక్’ కేసులో ప్రధాన నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ‘ఫాలక్’ (ఆకాశం) గా ఆసుపత్రి సిబ్బంది పేరు పెట్టిన పాపను జనవరి 18 తేదీన పద్నాలుగేళ్ల బాలిక ‘పాపకు తానే తల్లినంటూ’ ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో చేర్చిన సంగతి విదితమే. ముంబై టాక్సీ డ్రైవర్ రాజ్ కుమార్ అరెస్టుతో కీలక నిందితుడిని అరెస్టు చేసినట్లేనని…