ఢిల్లీ: ఎఎపి నేతకు సి.ఎం పదవి ఎరవేసిన బి.జె.పి

“The Party with a difference” అని బి.జె.పి నేతలు తమ పార్టీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. “The party with differences” అని కాంగ్రెస్ పరాచికాలాడుతుంది. కాంగీ పరాచికాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ కంటే తాము భిన్నం ఏమీ కాదని వివిధ సందర్భాల్లో బి.జె.పి నిరూపించుకుంది. తాజాగా ఎ.ఎ.పి ని చీల్చి ఢిల్లీలో అధికారం చేపట్టేందుకు బి.జె.పి ప్రయత్నించిన సంగతి వెల్లడి అయింది. గత లోక్ సభ ఎన్నికల్లో అమేధిలో రాహుల్ గాంధీ పై పోటీ…

యు.పి స్టింగ్: ఎఎపి టికెట్ కి డబ్బు డిమాండ్

ఆమ్ ఆద్మీ పార్టీ తరపున లోక్ సభకు పోటీ చేయడానికి ముందుకు వచ్చిన అభ్యర్ధులనుండి ఆ పార్టీ నాయకులు డబ్బు డిమాండ్ చేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. ఒక టి.వి ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ సంగతి వెల్లడి అయిన వెంటనే సదరు నాయకులను పార్టీ నుండి తొలగిస్తున్నట్లు ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. న్యూ ఢిల్లీ, తిలక్ లేన్ లో ఉన్న తన నివాసం వద్ద విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన ఎ.కె…

ఢిల్లీ విద్యుత్: కాగ్ ఆడిట్ పితలాటకం

ఢిల్లీ రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ మూడు ప్రైవేటు కంపెనీల ఆధీనంలో ఉన్నది. షీలా దీక్షిత్ రెండో ప్రభుత్వం, తన ఆధీనంలో ఉన్న విద్యుత్ పంపిణీని ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పిన పుణ్యం కట్టుకున్నారు. దానికి ఆమె చెప్పిన బృహత్కారణం విద్యుత్ ప్రసార నష్టాలను తగ్గించడం, విద్యుత్ దొంగతనాలను అరికట్టడం. ఆ రెండూ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నపుడు ఎందుకు జరగవో ఆమె చెప్పినట్లు లేదు. చెప్పినా, చెప్పకపోయినా ఈ కారణాలు చెప్పడం ద్వారా తమ ప్రభుత్వం చేతగానితనాన్నే ఆమె చాటుకున్నారు.…

విద్యుత్ సబ్సిడీ: ఎఎపి ప్రభుత్వంపై ముప్పేట దాడి

యుద్ధం మొదలయింది. జనం పక్షాన నిలిస్తే ఏమవుతుందో ఎఎపికీ, జనానికీ తెలిసి వస్తోంది. ఇంకా తెలియకపోతే ఇప్పుడన్నా తెలియాలి. సాంప్రదాయ పార్టీల రాజకీయ నాయకులు, పరిశ్రమ వర్గాలు, వీరిద్దరి చేతుల్లో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇప్పుడు మూడువైపుల నుండి ఢిల్లీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. మా ఆర్ధిక పరిస్ధితి బాగాలేదు కాబట్టి రోజుకి 10 గంటల కోత పెడుతున్నామని ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు ప్రైవేటు కంపెనీలు ప్రకటించాయి. మరోవైపు తమ పాత బాకీ…

అవినీతి రాజకీయ వ్యవస్ధకు మోడి ప్రతినిధి -ఎఎపి

భారత దేశంలోని అత్యంత అవినీతిమయమైన రాజకీయ వ్యవస్ధకు మాత్రమే నరేంద్ర మోడి ప్రతినిధి అని ఆయన పార్టీ చెప్పుకుంటున్నట్లు మార్పుకు ప్రతినిధి ఎంత మాత్రం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. బహుశా మోడిని నేరుగా విమర్శించడం ఎఎపికి ఇదే మొదటిసారి కావచ్చు. అరవింద్ కేజ్రీవాల్ గతంలో కొన్ని విమర్శలు చేసినప్పటికీ అవి ‘కర్ర విరగకుండా, పాము చావకుండా’ అన్నట్లు సాగాయి. ఈసారి కూడా విమర్శ చేసింది మరో నాయకుడు ప్రశాంత్ భూషణ్, అరవింద్ కాదు. “కాంగ్రెస్,…

కేజ్రివాల్, ఒక బహుమతి -కార్టూన్

“నేను ఒక విజయాన్నిగాని లేదా ఒక కేజ్రివాల్ ని గాని బహుమతిగా ఇమ్మని శాంతాను అడిగాను” – ఎ.ఎ.పి/కేజ్రివాల్ తో పొత్తు కాంగ్రెస్ కు లాభమా, నష్టమా? ఎ.ఎ.పి తో పొత్తు వద్దని కాంగ్రెస్ లో కొందరు నాయకులు మొదటి నుండి మొత్తుకుంటున్నారు. దానిక్కారణం ఆయన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై దాడి చేయడం ఒకటయితే, ముఖ్య కారణం కాంగ్రెస్ పాలనలో అవినీతిపై విచారణ జరిపిస్తానని వాగ్దానం చేయడం. కాంగ్రెస్ మద్దతు స్వీకరించడానికి కేజ్రివాల్ విధించిన 18 షరతుల్లో…

ఢిల్లీ రాష్ట్ర పీఠం – మ్యూజికల్ చైర్ -కార్టూన్

ఢిల్లీ రాష్ట్రంలో ఓ విచిత్రమైన పరిస్ధితి నెలకొంది. నిజమైన హంగ్ అసెంబ్లీ అంటే ఇదేనా అన్నట్లుగా ఉండడం ఈ విచిత్రంలో ఒక భాగం. ఇంతకు ముందు హంగ్ అసెంబ్లీ లేదా హంగ్ పార్లమెంట్ అనేకసార్లు ఏర్పడినా ప్రస్తుతం ఢిల్లీలో వచ్చిన పరిస్ధితి లాంటిది ఎప్పుడూ ఉద్భవించిన దాఖలా లేదు. గతంలో హంగ్ అసెంబ్లీ అన్నా, హంగ్ పార్లమెంటు అన్నా రాజకీయ సంక్షోభం గానీ రాజ్యాంగ సంక్షోభం గానీ ఉండేది కాదు. అంటే: ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ…