కాశ్మీర్ లో వింత ప్రభుత్వం -కార్టూన్
ఎన్నికలు జరిగిన 2 నెలలకు గాని జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడలేదు. రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకపోవడంతో, ముఖ్యంగా సెక్యులర్ ముద్ర కలిగిన కాంగ్రెస్ ప్రభ పడిపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు విపత్కరమైన ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ ఆటంకాలే కారణం అవునో కాదో ఇదమిద్ధంగా చెప్పలేం గానీ, ఓ వింత ప్రభుత్వం ఏర్పడిందన్న ఆలోచన మాత్రం పలువురికి కలుగుతోంది. వింత ప్రభుత్వం అనడం ఎందుకంటే ‘ఒక అంగీకారానికి వచ్చాం, కనీస ఉమ్మడి కార్యక్రమం…