వాళ్ళు ఇండియా కోసం ఏమైనా చేస్తారు -మోడి

భారత ప్రధాని నరేంద్ర మోడి నుండి ఇంతవరకు వినని మాటలు వినబడుతున్నాయి. దాదాపు ప్రతి (భారతీయ) మతానికి చెందిన సాంప్రదాయ దుస్తులు ధరించినప్పటికీ ముస్లింల టోపీ (skull cap) ధరించడానికి మాత్రం నిర్ద్వంద్వంగా నిరాకరించిన నరేంద్ర మోడి ఈ రోజు ముస్లింల దేశభక్తిపై పొగడ్తల వర్షం కురిపించారు. “నా అవగాహన ఏమిటంటే, వాళ్ళు మన దేశ ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు. భారతీయ ముస్లింలు వారి ట్యూన్ లకు నాట్యం చేస్తారని ఎవరైనా భావించినట్లయితే వారు భ్రమల్లో ఉన్నట్లే”…

అరేబియా అత్తరులు అన్నీ కలిపి కడిగినా… -జస్టిస్ కట్జు

(సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుతం ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ ఛైర్మన్ కూడా అయిన జస్టిస్ మార్కండేయ కట్జు నిర్మొహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో పేరు సంపాదించాడు. బాల్ ధాకరే మరణానంతరం అంతిమ యాత్ర కోసం ముంబై బంద్ చెయ్యడం పైన ఫేస్ బుక్ లో వ్యాఖ్య చేసిన, లైక్ చేసిన ఇద్దరు యువతులపై ఐ.టి చట్టం ప్రయోగించడాన్ని బహిరంగంగా తప్పు పట్టి తద్వారా ధాకరే నివాళుల పర్వంలో బారులు తీరిన పత్రికల పతాక శీర్షికలను…