అమెరికా: ఎట్టకేలకు ఒప్పందం, సంక్షోభం వాయిదా
సెనేట్ లో ఉభయ పార్టీల మధ్య ఒప్పందం కుదరడంతో ఎట్టకేలకు అమెరికా ఋణ పరిమితి సంక్షోభం, ప్రభుత్వ మూసివేత సంక్షోభం తాత్కాలికంగా పరిష్కారం అయ్యాయి. జనవరి 15 వరకు ప్రభుత్వ ఖర్చులు ఎల్లమారే బడ్జెట్, ఫిబ్రవరి 7 వరకూ అందుబాటులో ఉండే ఋణ పరిమితి పెంపుదల… ఒప్పందంలోని ప్రధాన అంశాలు. అనగా సంక్షోభం వాయిదా వేశారు తప్ప పరిష్కారం కాలేదు. పరిష్కారం చేసుకోడానికి వీలయిన చర్చలు చేయడానికి సమయం మాత్రం దక్కించుకున్నారు. దానర్ధం పరిష్కారం తధ్యం అని…