భారత దేశ సార్వభౌమాధికారంలోకి చొరబడుతున్న ఎస్&పి -కార్టూన్

ఎస్ & పి రేటింగ్ సంస్ధ పరిమితులను దాటుతోంది. ఎకనమిక్ ఫండమెంటల్స్ ను పరిశీలిస్తూ పెట్టుబడులు పెట్టడానికి మదుపుదారులకు మార్గదర్శకత్వం వహించే పాత్ర పరిమితులను దాటిపోయింది. ఇండియా క్రెడిట్ రేటింగ్ ని ‘ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్’ కంటే తగ్గిస్తామని హెచ్చరిస్తూ ఈ కంపెనీ, భారత ప్రభుత్వ నాయకత్వ సామర్ధ్యం పై కూడా తీర్పు ఇవ్వడానికి సిద్ధపడింది. జిడిపి వృద్ధి రేటు తగ్గిపోవడానికి కారణాలను మన్మోహన్ నాయకత్వంలోనూ, సోనియా గాంధి చొరబాటులోనూ వెతకడానికి ప్రయత్నించింది. రేటింగ్ ఇచ్చే పేరుతో…

ఇండియా రేటింగ్ తగ్గించిన ఎస్&పి

స్టాండర్డ్ & పూర్ రేటింగ్ సంస్ధ ఇండియా రేటింగ్ ‘ఔట్ లుక్’ ని తగ్గించింది. ఇండియా అప్పు రేటింగ్ ఇప్పటివరకూ BBB+ గా ఉండగా ఇప్పుడు దానిని BBB- కి తగ్గించింది. BBB+ ‘స్ధిర’ (stable) రేటింగ్ ని సూచిస్తుంది. BBB- రేటింగు సమీప భవిష్యత్తులో రేటింగ్ మరింత తగ్గించే అవకాశం ఉందన్న హెచ్చరికను సూచిస్తుంది. ఎస్&పి కేటాయించే ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్లలో BBB- అత్యంత తక్కువ రేటింగ్. AAA, AA, A, BBB తర్వాత BBB-…

యూరోపియన్ యూనియన్ క్రెడిట్ రేటింగ్ తగ్గిస్తాం -ఎస్ & పి హెచ్చరిక

యూరో జోన్ లోని మొత్తం పదిహేడు దేశాల క్రెడిట్ రేటింగ్ తగ్గినట్లయితే యూరోపియన్ యూనియన్ క్రెడిట్ రేటింగ్ కూడా తగ్గించాల్సి ఉంటుందని స్టాండర్డ్ అండ్ పూర్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ హెచ్చరించింది. ఇ.యు రేటింగ్ తో పాటు ఇ.యు లో ఉన్న అతి పెద్ద బ్యాంకుల రేటింగ్ కూడా తగ్గించాల్సి ఉంటుందని ఆ సంస్ధ హెచ్చరించింది. శుక్రవారం జరగనున్న యూరోపియన్ యూనియన్ సమావేశంలో సంక్షోభ పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఎస్ & పి పరోక్ష హెచ్చరిక చేసినట్లయ్యింది.…