నోట్ల రద్దు ఆర్‌బిఐ ప్రతిష్టను మంటగలిపింది -ఎస్&పి
డీమానిటైజేషన్ పరిణామాలు, ఫలితాలపై నివేదిక వెలువరించిన అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ ఎస్&పి పలు అంశాలను తన నివేదికలో పొందుపరిచింది. వాటిలో ఒకటి: అనేక యేళ్లుగా నిక్కచ్చి పని విధానంతో, ఉన్నత స్ధాయి ప్రమాణాలతో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీమానిటైజేషన్ వల్ల ఒక్కసారిగా పరువు పోగొట్టుకుందని చెప్పడం. “కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు చర్య సెంట్రల్ బ్యాంకు సమర్ధత, స్వతంత్రతలను మంటగలిపింది” అని ఎస్&పి తన నివేదికలో పేర్కొంది.…