భారత మందులపై అమెరికా చిందులు -ఈనాడు ఆర్టికల్

ఇండియా, అమెరికాల మధ్య ఔషధ వాణిజ్య యుద్ధం రేగుతోంది. భారత ఫార్మా కంపెనీలపై విచారణలు నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తూ తమ బహుళజాతి ఔషధ కంపెనీల ప్రయోజనాల కోసం అమెరికా అక్రమ చర్యలకు దిగుతోంది. మరోవైపు అమెరికా చర్యలపై డబ్ల్యూ.టి.ఓ కు ఫిర్యాదు చేయడానికి సంసిద్ధం అవుతోంది. ఈ అంశంపై ఈ రోజు ‘ఈనాడు’ దినపత్రికలో ప్రచురించబడిన నా ఆర్టికల్ ఇది. కింద బొమ్మపై క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ ఫార్మాట్ లో ఆర్టికల్ చూడవచ్చు. ఆర్టికల్ లో నేరుగా…

ఇండియా ఫార్మా పరిశ్రమ: త్వరలో అమెరికా ఆంక్షలు?

జెనెరిక్ ఔషధ తయారీలో పేరెన్నిక గన్న భారత ఫార్మా పరిశ్రమపై వాణిజ్య ఆంక్షలు విధించడానికి అమెరికాలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన బహుళజాతి ఔషధ కంపెనీలు అక్కడి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో ఎఫ్.డి.ఏ కమిషనర్ మార్గరెట్ హాంబర్గ్ ఇటీవలే ఇండియా పర్యటించారు. ఆమె వివిధ ఔషధ ఎగుమతి కంపెనీల పరిశ్రమలను తనిఖీ చేసి వెళ్ళిన అనంతరం ఇరు దేశాల మధ్య వాణిజ్య వాతావరణం మరింత వేడెక్కింది. ‘ప్రాధామ్య విదేశాలు’ (Priority Foreign Countries –…