ఎల్ నినో: ఈ జులై, చరిత్రలో అత్యధిక వేడిమి నెల
ఉష్ణోగ్రతలు నమోదు చేయడం మొదలు పెట్టిన దగ్గరి నుండి 2016 సంవత్సరం లోని జులై నెల అత్యంత వేడి నెలగా రికార్డు సృష్టించిందని అమెరికా ప్రభుత్వ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఉష్ణోగ్రతలు నమోదు చేయడం 137 సంవత్సరాల క్రితం ప్రారంభం అయిందని, ఇన్నేళ్లలో ఈ యేటి జులైలో ప్రపంచ వ్యాపితంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయని వారు తెలిపారు. యే సంవత్సరం తీసుకున్నా, జులై నెలలో అధిక ఉష్ణోగ్రతలు రికార్డు కావడం రివాజు అని అమెరికా శాస్త్రవేత్తలు చెప్పడం…