హవాలా స్కాంలో నేను రాజీనామా చేశా -అద్వానీ

బి.జె.పి పితామహుడు మనసులో మాట కక్కేశారు. లలిత్ మోడి అవినీతి కుంభకోణం నుండి బైటపడే మార్గం ఏమిటో తన పార్టీ నాయకులకు చూపారు. వివిధ అవినీతి మరియు అనైతిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే, రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తదితర బి.జె.పి మంత్రులు తక్షణమే తొక్కవలసిన బాట ఏమిటో ఆయన స్పష్టంగా చూపారు. వీరందరికీ మార్గం చూపడం అంటే…

బి.జె.పి పదవులకు అద్వానీ రాజీనామా, ముదిరిన సంక్షోభం

ఈనాడు పత్రిక అంచనా తల్లకిందులయింది. ఆ పత్రిక విలేఖరి ఊహించినట్లు అద్వానీ కోసం ప్లాన్ బి అంటూ ఏమీ లేదు. తన అభ్యంతరాలను పక్కకు నెట్టి, మోడీకి ఎన్నికల ప్రచార సారధ్య బాధ్యతలు అప్పజెప్పడంతో ఆ పార్టీ అగ్రనేత అద్వానీ తీవ్ర చర్యకు దిగారు. పార్టీలోని అన్నీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చెబుతూ ఆయన పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ కు లేఖ రాశారు. తన లేఖనే రాజీనామా పత్రంగా భావించాలని ఆయన కోరారు. అద్వానీ…

ప్లాన్-బి కోసం అద్వానీని పక్కన పెట్టారా? -కత్తిరింపు

ఈ రోజు (సోమవారం, 10.06.2013) ఈనాడు దినపత్రిక ఆరో పేజీలో ఒక ఆసక్తికరమైన విశ్లేషణ ప్రచురించారు. “ఏమో గుర్రం ఎగరా వచ్చు” శీర్షికన వచ్చిన ఈ విశ్లేషణ ప్రకారం అద్వానిని పక్కన పెట్టడం కూడా బి.జె.పి పధకరచనలో ఒక భాగమే. ప్లాన్-ఎ లో మోడి సారధ్యం వహించి పార్టీకి అత్యధిక సీట్లు రాబట్టాలి. ప్లాన్-ఎ విఫలం అయితే ప్లాన్-బి అమలులోకి వస్తుంది. ప్లాన్-బి ప్రకారం మోడి తగినన్ని సీట్లు కూడగట్టలేకపోతే గనక, మోడరేటర్ ముసుగు ధరించిన అద్వానీ…