సామ్ సంగ్ నోట్ 7: నెత్తురు కక్కుకుంటూ…

మొబైల్ ఫోన్ల మార్కెట్ లో యాపిల్ కంపెనీతో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ వస్తున్న సామ్ సంగ్ కంపెనీ తన తాజా ఫ్లాగ్ షిప్ మోడల్ నోట్ 7 వల్ల ఆర్ధికంగానూ, ప్రతిష్ట పరంగానూ నష్టాల్ని ఎదుర్కొంటోంది. ఎంతో ఆర్భాటంగా, ఎన్నో ఆశలు మరెంతో ఆసక్తి రేపిన సామ్ సంగ్ నోట్ 7 మోడల్ లోని బ్యాటరీ చార్జి చేసేటప్పుడు పేలి పోతుండడంతో ఎప్పుడూ లేనట్లుగా అమ్మిన ఫోన్లను వెనక్కి తీసుకుని డబ్బు ఇచ్చేయవలసిన పరిస్ధితికి…