మధ్యప్రాచ్యం: టర్కీ రష్యాల మధ్య చిగురిస్తున్న స్నేహబంధం

రాజకీయాల్లో శాశ్వత శతృత్వం గానీ, శాశ్వత మిత్రత్వం గానీ ఉండదు అని చెబుతుంటారు. ఇది అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలకు కూడా వర్తిస్తుందని టర్కీ, రష్యా రుజువు చేస్తున్నాయి. నిన్నటి వరకూ ఉప్పు, నిప్పుగా ఉన్న టర్కీ, రష్యాల మధ్య స్నేహ బంధం క్రమంగా సుదృఢం అవుతోంది. అమెరికా నేతృత్వం లోని నాటో మిలట్రీ కూటమి ప్రయోజనాలకు విరుద్ధంగా ఇది జరుగుతుండడంతో అంతర్జాతీయ రాజకీయాలలో ఈ పరిణామం ప్రముఖ చర్చనీయాంశం అవుతోంది. “టర్కీ, రష్యాల మధ్య త్వరలో స్నేహ…

ఎర్డోగన్ కుట్ర -ద హిందూ ఎడిట్.. 

[Erdogan’s coup శీర్షికన జులై 25 -ఈ రోజు- తేదీన ద హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్] ********* జులై 15 నాటి విఫల కుట్రకు టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ ప్రతీకారంతో చూపుతున్న అసమతూక ప్రతిస్పందన పెద్దగా ఆశ్చర్యం కలిగించేది కాదు. ఆయన ప్రభుత్వంలో పెచ్చరిల్లిన నియంతృత్వ ధోరణుల దృష్ట్యా తన శత్రువులను, విమర్శకులను నిర్మూలించటానికి, అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారని అనేక మంది హెచ్చరించారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు జరుగుతున్నది సరిగ్గా…

టర్కీలో అలజడి -ది హిందు ఎడిట్…

[True translation for today’s editorial: Turmoil in Turkey] *** కుట్రలతో కూడిన రాజకీయ వ్యవస్ధకు టర్కీ ఒక ఉత్తమ తార్కాణం. అక్కడి మిలటరీ సాపేక్షికంగా స్వతంత్రమైనది, ప్రజలలో పలుకుబడి కలిగినట్టిది. గతంలో అది నాలుగు సార్లు పౌర ప్రభుత్వాలను కూల్చివేసింది. ఉన్నత పాలక వర్గానికి, మిలటరీ వ్యవస్ధకు మధ్య అక్కడ ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉంటుంటాయి. అయితే 2002 నుండి జస్టిస్ అండ్ డవలప్ మెంట్ పార్టీ నేతృత్వంలో సాపేక్షికంగా సాగుతున్న సుస్ధిర పాలన, దాని…

లాతుఫ్ కార్టూన్ లపై టర్కీ నిషేధం

పాత టర్కీ ఒట్టోమాన్ సామ్రాజ్యం తరహాలో మధ్య ప్రాచ్యంలో సరికొత్త టర్కీ సామ్రాజ్యాన్ని స్ధాపించాలని కలలు గంటున్న టర్కీ ప్రధాని రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, అంతకంతకూ ఫాసిస్టు రూపం ధరిస్తున్నాడు. సిరియా విచ్ఛిన్నానికి కుట్రలు పన్నిన పశ్చిమ సామ్రాజ్యవాదుల వ్యూహాల్లో తురుపు ముక్కగా మారి అత్యంత విద్రోహకర, ప్రగతి నిరోధక పాత్ర పోషిస్తున్న క్రమంలో ఎర్డోగన్ టర్కీ ప్రజల ప్రాధమిక హక్కులను ఒక్కొక్కటిగా హరించి వేస్తున్నాడు. వేలాది ప్రతిపక్ష నేతలతో పాటు వారి మద్దతుదారులను కూడా జైళ్ళలో…