జార్జి ఫెర్నాండెజ్: పైకి అమెరికా వ్యతిరేకి, లోపల సి.ఐ.ఏ ఏజెంటు!

వికీలీక్స్ పత్రాలు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. డబ్బుతో సంబంధం లేకుండా వికీలీక్స్ తో ఒప్పందం చేసుకున్న ది హిందు పత్రిక తాజాగా మరిన్ని ‘డిప్లొమేటిక్’ కేబుల్స్’ లోని అంశాలను సోమవారం నుండి ప్రచురిస్తోంది. ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ అంటే అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ (విదేశాంగ శాఖ) కూ, వివిధ దేశాలలో అమెరికా నియమించుకున్న రాయబారులకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు. హెన్రీ కిసింజర్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ (విదేశాంగ మంత్రి) గా పని చేసిన కాలంలో…

సిరియా కాల్పులపై భద్రతాసమితి తీర్మానాన్ని వ్యతిరేస్తున్న ఇండియా, చైనా, రష్యాలు

నాలుగు రోజులనుండి సిరియా ఆందోళనలపై అక్కడి ప్రభుత్వం స్పందిస్తున్న తీరును ఖండించడానికి భద్రతా సమితిలొ జరుగుతున్న చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న ఆందోళనకారులపై సిరియా ప్రభుత్వం కాల్పులు జరుపుతున్నదనీ, వారితో చర్చలు జరిపేవిధంగా సిరియాపై ఒత్తిడి తేవడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. సమితి తీర్మానాన్ని అడ్డు పెట్టుకుని పశ్చిమ దేశాలు ఎంతకైనా తెగిస్తాయన్న విషయం లిబియా అనుభవం ద్వారా స్పష్టం కావడంతో సిరియాపై తీర్మానాన్ని ఇండియా, చైనా, రష్యా ప్రభుత్వాలు గట్టిగా…