ఎబోలా యుద్ధంలో మరో విజయం -ది హిందు ఎడిట్

(జనవరి 24 తేదీన ప్రచురించబడిన ‘Another Ebola battle won’ కు యధాతధ అనువాదం. -విశేఖర్) ********* జనవరి 18 తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ, మాలి ప్రభుత్వంలు మాలిని ఎబోలా వైరస్ నుండి విముక్తి అయిన దేశంగా ప్రకటించాయి. ఈ ప్రాణాంతక వ్యాధి నుండి విముక్తి అయిన దేశాలలో నైజీరియా, సెనెగల్ ల తర్వాత మాలి మూడవది. ఎబోలా వైరస్ నుండి విముక్తి అయినట్లుగా ఒక దేశాన్ని ప్రకటించాలంటే వరుసగా 42 రోజుల పాటు అక్కడ…

పగవాడిక్కూడా వద్దు ఈ ఎబోలా బ్రతుకు! -ఫోటోలు

  అస్పృశ్యత ఇప్పుడు భారత దేశంలో అసలే లేదని కాదుగానీ, ‘మొలకు ముంత, వీపుకి తాటాకు’ కట్టుకుంటే తప్ప పంచముడిని బైటికి రానీయని గుప్తుల ‘స్వర్ణ యుగం’లో దళితుడి జీవితం ఎలా ఉండేది? ఈ అనుమానం ఎవరికైనా వస్తే పశ్చిమాఫ్రికా దేశాలలో ఎబోలా వ్యాధి పీడితుల బతుకులు గమనిస్తే ఒకింత అవగాహన రావచ్చు. ఎబోలా సోకినట్లు అనుమానం వచ్చిందా, ఇక ఆ వ్యక్తి చెంతకు ఎవరూ రారు. వారిని ఎవరూ తాకరు. వారి శరీరాన్ని మాత్రమే కాదు,…