బేసి-సరి: ముంబైకి కూడా కావాలి -ఎన్‌సి‌పి

కాలుష్యం తగ్గించడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తమ ఢిల్లీ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న బేసి-సరి పధకం ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తోంది. ఢిల్లీలో అమలు చేస్తున్న పధకాన్ని ముంబై నగరంలో కూడా అమలు చేయాలని మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎన్‌సి‌పి నేతల డిమాండ్ ను తాము పరిశీలిస్తున్నామని బి.జె.పి ప్రభుత్వ మంత్రులు కూడా చెప్పడం విశేషం. ఢిల్లీలో అమలు చేస్తున్న పధకం విజయవంతం అయినట్లతే దానిని ముంబైలో కూడా అమలు…

మహారాష్ట్ర: కూటమి కుమ్ములాటల్లో బి.జె.పి-సేన హవా -కార్టూన్

బి.జె.పి, శివ సేనల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరిందిట. ఇరు పార్టీలూ కలిసి తమ కూటమిలోని మిగిలిన పక్షాలకు సీట్లు కత్తిరించడం ద్వారా తమ తగాదా పరిష్కరించుకున్నారు. బి.జె.పి 130 సీట్లకూ, శివసేన 151 సీట్లకూ పోటీ చేస్తాయట. కూటమిలోని ఇతర పార్టీలకు 18 సీట్లు కేటాయించాల్సి ఉండగా ఇప్పుడు 7 మాత్రమే ఇస్తున్నారు. శివసేన తన డిమాండ్ కు ఒక్క సీటూ తగ్గించుకోలేదు. దానితో బి.జె.పి ఇతర పార్టీలకు కేటాయించిన సీట్లలో 11 సీట్లను ఆక్రమించింది.…

ఒకరిది హైరానా, మరొకరిది ఘరానా -కార్టూన్

ఆటగాళ్ళు ఇద్దరూ క్రీజు వదిలి మధ్యలో నిలబడి మాట్లాడుకుంటున్నారు. కాదు, పోట్లాడుకుంటున్నారు. బంతిని తొందర తొందరగా వికెట్ల దగ్గరికి విసిరేస్తే వికెట్లను పడగొట్టి ఆటగాళ్లను ఔట్ చేయొచ్చని ఫీల్డర్లు, బౌలర్, వికెట్ కీపర్ ల హైరానా! ఒక ఆటగాడే మొత్తం టైమ్ అంతా తినేస్తున్నాడు. మరో ఆట గాడికి బ్యాట్ ఝుళిపించే సమయం దొరికి చావడం లేదు. స్ట్రైకింగ్ ఛాన్స్ వస్తే తన సత్తా చూపించవచ్చని మరో ఆటగాడి ఆత్రం. కానీ తాను నిలదొక్కుకున్నా గనక తన…