అమెరికా కోసం అణు చట్టానికి బి.జె.పి కొత్త అర్ధం

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం చేతికి రాగానే మరొక మాట చెప్పడం భారత దేశంలో రాజకీయ పార్టీలకు మామూలు విషయం. కానీ కాంగ్రెస్, బి.జె.పిలు తమ మాటల్ని తాము ఎక్కడ ఉన్నామన్నదానిపై ఆధారపడి ఒకరి మాటలు మరొకరు అరువు తెచ్చుకోవడం ఒక విశేషంగా కొనసాగుతోంది. విశేషం అనడం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బి.జె.పి ఏ సూత్రాలు బోధించిందో సరిగ్గా అవే సూత్రాలను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ బోధిస్తోంది. అలాగే అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తన…

25వ అణు విద్యుత్ కర్మాగారం నిర్మాణం ప్రారంభించిన ఇండియా

ఫుకుషిమా అణు ప్రమాదం, అణు విద్యుత్ కర్మాగారాల భద్రత పట్ల అనేక సమాధానాలు దొరకని ప్రశ్నలను అనేకం లేవనెత్తినప్పటికీ భారత దేశం కొత్త అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం నుండి వెనక్కి తగ్గడం లేదు. ఫుకుషిమా దైచి అణు కర్మాగారం వద్ద మూడు అణు రియాక్టర్లలోని విద్యుత్ ప్రసార వ్యవస్ధ దెబ్బతినడంతో కూలింగ్ వ్యవస్ధ నాశనమై ఇంధన కడ్డీలు వేడెక్కి కరిగిపోయి, పెద్ద ఎత్తున పేలుళ్ళు సంభవించిన సంగతి విదితమే. ఈ కర్మాగారం నుండి విడుదలవుతున్న రేడియేషన్‌ను…