మంచి రోజులు కాదు యు.పి.ఏ రోజులే తిరిగొచ్చాయ్

“అచ్ఛే దిన్ ఆనేవాలా హై” (మంచి రోజులు వస్తున్నాయ్)… ఇది బి.జె.పి/ఎన్.డి.ఏ/నరేంద్ర మోడి ఎన్నికల నినాదం. ఇవ్వడానికి ఈ నినాదమే ఇచ్చినా తాము అమలు చేస్తున్నది మాత్రం యు.పి.ఏ విధానాలే అని పార్లమెంటు సాక్షిగా ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఆహార ధరలు పెరగడమే కాకుండా ద్రవ్యోల్బణం ఊర్ధ్వ స్ధాయిలో కొనసాగుతుండడంతో స్వల్ప కాల చర్చకు సమాధానం ఇస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. యు.పి.ఏ చేసిన నిర్ణయాలనే తాము అమలు చేస్తున్నామని ఆయన…

పునఃప్రచురణ: కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి

(ఈ ఆర్టికల్ గత ఏప్రిల్ 24 తేదీన రెండు భాగాలుగా ప్రచురించబడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపధ్యంలో రెండింటినీ కలిపి ఒకే ఆర్టికల్ గా పునఃప్రచురిస్తున్నాను -విశేఖర్) భారత దేశంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కోసం ఆత్రం ఎదురు చూస్తున్నది ఎవరు? భారత ప్రజలైతే కాదు. ఎందుకంటే వారిలాంటి ఎన్నికల్ని అనేకం చూశారు. ఎన్నికల వల్ల, ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వాల వల్లా తమకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదని వారికి ఎప్పుడో అర్ధమైపోయింది. కొత్త…

ఓటమి: ఎన్నికల ముందు కాంగ్రెస్, ఫలితాల ముందు బి.జె.పి

ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడి వదిలేసిందని వివిధ పత్రికలు, ఛానెళ్లు తమ తమ విశ్లేషణల్లో పేర్కొన్నాయి. నరేంద్ర మోడి, అమిత్ షా లు చేసిన తాజా ప్రకటనలతో ఫలితాలకు ముందే బి.జె.పి తన ఓటమిని అంగీకరిస్తోందని ఇప్పుడు పత్రికలు, ఛానెళ్లు విశ్లేషిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ప్రచారం మొదలయిందో లేదో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 7 రేస్ కోర్స్ రోడ్ నుండి కృష్ణ మీనన్ రోడ్ కు తన నివాసాన్ని మార్చేసుకున్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్…

కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి -1

భారత దేశంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కోసం ఆత్రం ఎదురు చూస్తున్నది ఎవరు? భారత ప్రజలైతే కాదు. ఎందుకంటే వారిలాంటి ఎన్నికల్ని అనేకం చూశారు. ఎన్నికల వల్ల, ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వాల వల్లా తమకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదని వారికి ఎప్పుడో అర్ధమైపోయింది. కొత్త ప్రభుత్వాల వల్లా, వాటి నిర్ణయాల వల్లా ఎప్పుడూ ఎవరైతే లాభం పొందుతారో వారే ఎన్నికల ఫలితాల కోసం ఇప్పుడూ ఆత్రపడుతున్నారు. పోటీ చేసేదే రాజకీయ పార్టీలు గనక వాటికి…

మోడి గాలి జనం ఒప్పుకోరు -నితీష్ కుమార్

ఎన్.డి.ఎ కూటమి ఏర్పడినప్పుడు విధించిన షరతులు ఇప్పటికీ వర్తిస్తాయని, అలా అయితేనే కూటమి కొనసాగుతుందని జనతా దళ్ (యునైటెడ్) పార్టీ నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశాడు. ‘తాము ఒక తుఫాను సృష్టిస్తామని, ప్రజలు దానిని అంగీకరిస్తారని’ కొంత మంది భావిస్తున్నారని, కానీ ప్రజలు చదువు లేకపోయినా చాలా తెలివైనవారని మోడిని పరోక్షంగా ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు. తెలివైన ప్రజలు ఎలాంటి గాలిని ఒప్పుకోరని రాజకీయ నాయకులు చెప్పే మాటల్లో విషయం ఉన్నదీ లేనిదీ వారు…

మతమౌఢ్యం ప్రజలకు ఇష్టం లేదు, మోడిని ఉద్దేశిస్తూ జె.డి(యు)

ప్రధానమంత్రి పదవి కోసం ఎన్.డి.ఏ లో పోటీ తీవ్రం అయినట్లు కనిపిస్తోంది. మౌతమౌఢ్యం ఉన్నవారిని ప్రధానిగా దేశ ప్రజలు అంగీకరించరని ఎన్.డి.ఏ భాగస్వామి జనతాదళ్ (యునైటెడ్) పార్టీ నాయకుడు శివానంద్ తివారీ బుధవారం వ్యాఖ్యానించి మోడి పట్ల తమ పార్టీ కి ఉన్న వ్యతిరేకతను మరోసారి వ్యక్తం చేశాడు. 2014 లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో లేక ప్రతిపక్షంలోనే కూర్చోవాలో బి.జె.పి నిర్ణయించుకోవాలని ఆయన హెచ్చరించాడు. నరేంద్ర మోడి ని పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘మతమౌఢ్యంతో నిండిన…