వెనుదిరిగిన (అరబ్) వసంతం -ది హిందు ఎడిట్..

2013లో జరిగిన మిలట్రీ కుట్ర ద్వారా అధికారం నుండి కూల్చివేయబడిన ముస్లిం బ్రదర్ హుడ్ (ద ఇఖ్వాన్) నాయకులపై మోపిన ప్రధాన క్రిమినల్ కేసుల నుండి వెలువడతాయని భావిస్తున్న అనేక తీర్పుల్లో ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహమ్మద్ మొర్సీ, ఆయన సహ ప్రతివాదులపై గత వారం వెలువడిన దోషిత్వ నిర్ధారణ తీర్పు మొదటిది. డిసెంబర్ 2012లో అధ్యక్ష భవనం వెలుపల నిరసనకారులపై అల్లర్లు రెచ్చగొట్టినందుకు గాను మోర్సీకి 20 యేళ్ళ కారాగారవాస శిక్ష విధించారు. నూతన రాజ్యాంగ…

మోడి సుపరిపాలనా సూత్రాలు -కార్టూన్

“యెస్, సర్…” “గవర్నర్లు…” “ఎన్.జి.ఓ లు…” “… ఇంకా, హిందీలో రాయాలి!” “మరిన్ని స్టిక్-ఆన్ నోట్ లా, సర్?” “గరిష్ట (సు)పరిపాలన కోసం కాసిన్ని చిన్న చిన్న సవరణలు… అంతే…” *** ప్రధాని నరేంద్ర మోడి ఎన్నికల నినాదాల్లో ‘సుపరిపాలన’ (Good Governance) ఒకటి. యు.పి.ఏ ప్రభుత్వం మా చెడ్డదనీ తాను ప్రధాని అయ్యాక దేశ ప్రజలకు ‘సుపరిపాలన’ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని ఆయన ప్రచారం చేశారు. గుజరాత్ ప్రజలకు రుచి చూపించిన సుపరిపాలన…

ఎన్.జి.ఓలు vis-a-vis మోడి -కార్టూన్

“… ఆ, అవే, మనకి అనుకూలంగా తిరగడం లేదు చూశావా, అక్కడికి పద…” *** ఎన్.జి.ఓ లు మరొకసారి చర్చనీయాంశం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గూఢచార సంస్ధ ‘ఇంటలిజెన్స్ బ్యూరో’ (ఐ.బి), అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమ సంస్ధగా చెప్పుకునే గ్రీన్ పీస్ కీ, ఇంకా ఇతర సంస్ధలకు వ్యతిరేకంగా ప్రధాన మంత్రికి నివేదిక ఇవ్వడంతో తాజాగా ఎన్.జి.ఓలపై చర్చ నడుస్తోంది. గ్రీన్ పీస్ తదితర ఎన్.జి.ఓల కార్యకలాపాలు భారత దేశ అభివృద్ధికి ఆటంకంగా మారాయన్నది సదరు నివేదిక…

మరుగుజ్జు ఎఎపి కి ఆమ్ ఆద్మీయే కవచం -కార్టూన్

ఆమ్ ఆద్మీ పార్టీగానీ, అరవింద్ కేజ్రీవాల్ గానీ ఏ విధంగా చూసినా రాజకీయాలకు కొత్త. కాంగ్రెస్, బి.జె.పి పార్టీలతోనూ, వారి నాయకులతోనూ పోల్చితే ఎఎపి, అరవింద్ లు మరుగుజ్జులు అన్నట్లే. అరవింద్ కేజ్రీవాల్ స్వతహాగా ఎన్.జి.ఓ నేతే గానీ రాజకీయ నేత కాదు. ఎఎపి లో ఉన్న ఇతర నేతలు కూడా ఎక్కువమంది ఎన్.జి.ఓ సంస్ధల నేతలే. ఈ ఎన్.జి.ఓ లను పోషించేది విదేశీ కంపెనీలు. ఎన్.జి.ఓలను ప్రెజర్ గ్రూపులుగా ఏర్పరచుకుని స్వకార్యం చక్కబెట్టుకునే విదేశీ కంపెనీలు…