ఎన్ కౌంటర్లు ఎందుకు చట్టవిరుద్ధం?

‘నిన్ను ఎన్ కౌంటర్ చేసేస్తా’ ఇది పోలీసు సినిమాల్లో తరచుగా వినపడే పదం. ఎన్ కౌంటర్ చేయడాన్ని వీరోచితకార్యంగా సినిమాలు వాడుకలోకి తెచ్చాయి. ‘ఎన్ కౌంటర్ స్పెషలిస్టు’ అనే బిరుదు కొందరు పోలీసులకు పత్రికలు తగిలించడం మొదలై చాలాకాలమే అయింది. వీటన్నింటి మూలంగా ఎన్ కౌంటర్ చెయ్యడం పోలీసుల విధి, కర్తవ్యం, బాధ్యత… ఇత్యాదిలాగా పరిస్ధితి తయారయింది. ఆంద్ర ప్రదేశ్ మాత్రమే కాదు, దాదాపు పోలీసులు, సైన్యంలకు ఆధిపత్యం అప్పగించి పాలన సాగించే ప్రతి చోటా ఈ…