పాక్ తో అణు సంబంధాలు కొనసాగుతాయి -చైనా
ఎవరేమనుకున్నా పాకిస్ధాన్ తో తమ అణు వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయని చైనా స్పష్టం చేసింది. అంతర్జాతీయ నియమ నిబంధనలకు కట్టుబడే తాము పాకిస్ధాన్ కు అణు రియాక్టర్లు సరఫరా చేస్తున్నామని ‘న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‘ (ఎన్.ఎస్.జి) నిబంధనలు కూడా తాము అతిక్రమించడం లేదని చైనా తెలిపింది. కనీసం రెండు కొత్త అణు రియాక్టర్ల నిర్మాణానికి చైనా సహకరిస్తోందని, ఇది అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో చైనా తన అణు వ్యాపారాన్ని గట్టిగా సమర్థించుకుంది. ఎన్.ఎస్.జి…