స్నోడెన్ వస్తే అమెరికాకి అప్పగించం -స్విస్ మీడియా
అమెరికా గూఢచర్యంపై సాక్ష్యం ఇవ్వడానికి స్నోడెన్ తమ దేశం వస్తే ఆయనను అమెరికాకు అప్పగించకపోవచ్చని స్విట్జర్లాండ్ మీడియా కధనాలు ప్రచురిస్తోంది. ఈ మేరకు స్విట్జర్లాండ్ అటార్నీ జనరల్ స్విస్ ప్రభుత్వానికి ఒక పత్రం సమర్పించారని సోన్టాగ్స్ జీటంగ్ (స్విస్) పత్రికను ఉటంకిస్తూ రష్యా టుడే (ఆర్.టి) పత్రిక తెలిపింది. అయితే ప్రభుత్వంలో ఉన్నత స్ధాయిలో దానికి విరుద్ధంగా హామీ ఇస్తే చెప్పలేమని అటార్నీ జనరల్ చెప్పినట్లు తెలుస్తోంది. అనగా స్విస్ మీడియా అంచనాకు భిన్నంగా స్నోడెన్ రక్షణకు…