ఆసియా కోసం ఓ కొత్త బ్యాంకు -ది హిందు ఎడిటోరియల్

(బ్రెట్టన్ వుడ్ కవలలుగా అభివర్ణించబడే ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ ల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ మరో బ్యాంకు ఆసియా ఖండం కోసం ఆవిష్కృతం అయింది. ఇది కూడా చైనా చొరవతో, అత్యధిక చైనా నిధులతో, ఇండియా దన్నుతో రూపుదిద్దుకోవడం గమనార్హం. బీజింగ్ లో 21 దేశాల వ్యవస్ధాపక భాగస్వామ్యంతో ఆసియన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు బీజింగ్ లో ప్రారంభం అయింది. బ్యాంకుకు పురిట్లోనే సంధి కొట్టడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నించినా ఆటంకం అధిగమిస్తూ ఎ.ఐ.ఐ.బి…