కాంగ్రెస్: ఓటమి సంపూర్ణం – బి.జె.పి: కరువు తీరింది

కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మట్టి కరిచింది. సంపూర్ణంగా ఓటమి పాలయింది. మరోవైపు బి.జె.పికి కరువుతీరా విజయం లభించింది. ఎన్.డి.ఏ కూటమి భాగస్వామ్య పార్టీలతో సంబంధం లేకుండానే సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు చేయగల సీట్లను సంపాదించేవైపుగా బి.జె.పికి సీట్లు వస్తాయని ఫలితాల సరళి చెబుతోంది. కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో పాటు బి.జె.పి అనుసరించిన ప్రచార ఎత్తుగడలు ఆ పార్టీకి అమితంగా ఉపయోగపడ్డాయని స్పష్టం అవుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈసారి కూడా…

EXIT: బయటకు దారి -కార్టూన్

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేన్ని సూచిస్తున్నాయో ఈ కార్టూన్ చెబుతోంది. కానీ బయటకు వెళ్ళే పెద్దాయనా, లోపలికి వస్తున్న మరో పెద్దాయనా ఇద్దరూ ఇంకా గడప దాటకుండా కార్టూనిస్టు జాగ్రత్త పడ్డారు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికారిక ఎన్నికల ఫలితాలు కాదు గనక! ప్రధాని మన్మోహన్ ఇప్పుడు సంచి సర్దుకుంటున్నట్లు చూపారు గానీ నిజానికి ఆయన ఎప్పుడో మకాం మార్చేశారు. ఒకవేళ యు.పి.ఏ III ప్రభుత్వం ఏర్పడ్డా ఆయన మాత్రం ప్రధాని నివాసం ఖాళీ చేయక తప్పదు.…