ఎకనమిక్ సర్వే 2018: 10 ప్రధాన అంశాలు
జనవరి 29 తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎకనమిక్ సర్వే – 2018, 10 ప్రధాన అంశాలను గుర్తించింది. ఇవి భారత ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణీయన్ దృష్టిలో ప్రధానమైనవి. ‘పది కొత్త ఆర్ధిక నిజాలు’ అని సర్వే వీటిని అభివర్ణించింది. ప్రజల వైపు నుండి చూసినపుడు ప్రధానం కావచ్చు, కాకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నియమించుకున్న సలహాదారు కనుక ఈ అంశాలు పాలకవర్గాల దృక్కోణం నుండి ప్రధాన అంశాలుగా ఉంటాయని గుర్తించడం సబబు.…