ఢిల్లీ: సామాన్యుడి దెబ్బకు దిమ్మ తిరిగింది!

ఆమ్ ఆద్మీ దెబ్బ ఏమిటో సంపన్నులకు రుచి చూపిన ఘనత ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పజెబుదాం. ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో భారత దేశంలోని సామాన్య కార్మికవర్గ పౌరుడు కాస్త గర్వంగా తల ఎగరవేయదగ్గ రోజు ఈ రోజని చెప్పడంలో సందేహం లేదు. స్ధల, కాల పరిమితులను దృష్టిలో పెట్టుకుంటే భారత దేశంలోని పార్లమెంటరీ రాజకీయాల్లో అచ్చంగా సామాన్య ప్రజలు ఐక్యమై పాలకవర్గాలకు వారి వెనుక ఉన్న సంపన్న కులీన దోపిడీ శక్తులకు…