నగ్నత్వం కాదు, ముస్లిం అస్తిత్వమే ఎం.ఎఫ్ హుస్సేన్ పై దాడులకు కారణం

(రచయిత: నాగరాజు అవ్వారి) ఎం.ఎఫ్.హుస్సేన్ ఆధునిక చిత్రకారుడు. ఆయన చిత్రాలలో రూపం రీత్యా క్యూబిజం వంటి అనేక ఆధునిక ధోరణులు కనిపిస్తాయి. అయితే భావజాల రీత్యా సంపూర్ణంగా ఆధునికుడని ఆయనను ఒప్పుకోవడం కష్టం. ఏ రకమైన భావజాలానికీ ఆయన ప్రాతినిధ్యం వహించకపోవడం దీనికి కారణం. ప్రత్యేకంగా ఏ ఒక్క భావజాలానికీ ప్రాతినిధ్యం వహించక పోవడంవల్ల ఆయన చిత్రాలలో రూపంలోనూ, సారంలోనూ అనేక రకమైన ధోరణులు కనపడతాయి. ఆరెస్సెస్ ఆయన పట్ల తీసుకున్న వైఖరికి ప్రత్యేకమైన కారణాలున్నాయి. “హిందూత్వ”కు…

ఈ ఎం.ఎఫ్.హుస్సేన్ చిత్రంలో నగ్నత్వం ఉందా?

ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ ఈ చిత్రాన్ని గీశాడు. 2009 సంవత్సరంలో మార్చి 8 తేదీన అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా డెక్కన్ క్రానికల్ పత్రిక ఈ చిత్రాన్ని ప్రచురించింది. భారతదేశ మహిళల స్త్రీత్వం యొక్క సారం వారి శక్తే (Essence of Indian womenhood is shakti) అని ఎం.ఎఫ్.హుస్సేన్ ఈ చిత్రానికి శీర్షికగా పెట్టాడు. భారత దేశ మహిళల శక్తికి దుర్గా దేవిని ప్రతీకగా చూపిస్తూ హుస్సేన్ ఈ బొమ్మని గీసినట్లు చూస్తే…

బూతు బొమ్మలు, మత సంస్ధలు

(గమనిక: గురు గోల్వాల్కర్ వ్యక్తం చేసిన భావాలపైన నేను రాసిన పోస్టుకి ఇది మిత్రుడు ప్రవీణ్ రాసిన వ్యాఖ్య. ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావించబడినందున పోస్టుగా మలిచాను. చర్చలో పాల్గొనవలసిందిగా ఇతర మిత్రులను ఆహ్వానిస్తున్నాను. ఎం.ఎఫ్.హుస్సేన్ బొమ్మలని కేవలం బూతు బొమ్మలుగానూ, ఆడవాళ్ళని చెత్తగా చూపించడంగానూ ప్రవీణ్ పేర్కొన్నాడు. కళాకారులు చాలామంది అలా భావించరు. అలాగే మత విశ్వాసాలు గాయపడ్డాయని భావించబడినప్పుడు వివిధ మతస్ధులలో వచ్చిన ప్రతిస్పందనలలో తేడాలను ప్రవీణ్ ప్రస్తావించాడు. ఈ తేడాల ద్వారా…

ప్రవాసంలోనే మరణించిన “పికాసో ఆఫ్ ఇండియా” ఎమ్.ఎఫ్.హుస్సేన్

“పికాసో ఆఫ్ ఇండియా” గా ప్రసిద్ధికెక్కిన ప్రఖ్యాత భారత పెయింటింగ్ కళాకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ ప్రవాసంలో ఉండగానే మరణించాడు. 2006 సంవత్సరంలో లండన్‌కి ప్రవాసం వెళ్ళిన ఎం.ఎఫ్.హుస్సేన్ కొన్ని నెలలుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చనిపోయేనాటికి ఖతార్ పౌరుడుగా ఉన్న ఎం.ఎఫ్.హుస్సేన్ భారత దేశంలో అనేక సార్లు దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. భారతదేశ సంస్కృతి పరిరక్షకులుగా తమను తాము నియమించుకున్న హిందూ మత సంస్ధల కార్యకర్తలు అనేక సార్లు ఎం.ఎఫ్.హుస్సేన్ పెయింటింగ్ ప్రదర్శనలపై దాడులు చేసి…