కాలిఫోర్నియా: పోలియో తరహా వ్యాధితో 25 మంది పిల్లలు

పోలియో రహిత ప్రపంచాన్ని స్ధాపిద్దాం అంటూ న్యూయార్క్ నడిబొడ్డున ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు సందేశం ఇస్తుండగా ఐరాస కార్యకలాపాలకు కేంద్ర అయిన అమెరికాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్ధితి ఉన్నట్లు కనిపిస్తోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కాలిఫోర్నియా రాష్ట్రంలోని పిల్లలను ఇప్పుడో వింత వ్యాధి భయపెడుతోంది. సరిగ్గా పోలియో తరహాలోనే పిల్లల కాళ్ళు, చేతులు ఒక్కసారిగా చచ్చుబడిపోతున్నాయి. పోలియో తరహా వ్యాధి అని డాక్టర్లు చెబుతున్నప్పటికీ పోలియో మాత్రం కాదని కూడా వారు చెబుతున్నారు. ఫుకుషిమా…