ఇటలీ: యూరోని వదిలేస్తే తప్ప ఆర్ధిక వృద్ధి అసాధ్యం!

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
  బ్రెగ్జిట్ రిఫరెండం అనంతరం ఈయూ సభ్య దేశాలలో క్రమంగా అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. యూరో జోన్ నుండి బైట పడాలని కొన్ని దేశాలలోని పార్టీలు డిమాండ్ చేస్తుంటే అసలు యూరోపియన్ యూనియన్ నుండే బైట పడాలని మరికొన్ని సభ్య దేశాలలోని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.  యూరో జోన్ నుండి బైట పడడం అంటే ఉమ్మడి కరెన్సీ యూరోని జాతీయ కరెన్సీగా త్యజించడం. యూరోపియన్ యూనియన్ నుండి బైట పడటం అంటే అసలు…

గ్రీసు దివాలాకు యూరప్ ఏర్పాట్లు?

ఋణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐరోపా రాజ్యాలు గ్రీసు దివాలా తీసే పరిస్ధితికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యూరో జోన్ (యూరోను ఉమ్మడి కరెన్సీగా కలిగి ఉన్న 17 ఈ.యు సభ్య దేశాల సమూహం) నాయకురాలైన జర్మనీ ఆర్ధిక మంత్రి ఈ మేరకు తగిన సూచనలు ఇస్తున్నట్లు వాణిజ్య పత్రికలు, పరిశీలకులు భావిస్తున్నారు. గ్రీసు తన జాతీయ కరెన్సీ డ్రాక్మాను రద్దు చేసుకుని యూరోను తమ కరెన్సీగా స్వీకరించిన దేశాల్లో ఒకటి. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం…

అధిక ఫిస్కల్ లోటు ఋణ సంక్షోభానికి దారి -ఈనాడు

ఈ వారం ఈనాడు పత్రికలో ఫిస్కల్ డెఫిసిట్, రెవిన్యూ డెఫిసిట్ ల గురించి చర్చించాను. మార్కెట్ ఎకానమీ ఉన్న ఆర్ధిక వ్యవస్ధల్లో ఫిస్కల్ డెఫిసిట్ (కోశాగార లోటు) కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు నెలకొని ఉన్నప్పుడు, “మన ఎకనమిక్ ఫండమెంటల్స్ స్ధిరంగా ఉన్నాయి. ఇబ్బందేమీ లేదు” అని ఆర్ధిక మంత్రులు, ప్రధాన మంత్రులు మేకపోతు గాంభీర్యంతో చెబుతుంటారు. అలాంటి ఫండమెంటల్స్ లో ఫిస్కల్ డెఫిసిట్ ఒకటి. ప్రభుత్వాలు రాబడి కంటే ఖర్చు…

అమెరికా, ఇటలీ రాజకీయ సంక్షోభం; ఇండియా షేర్లు పతనం

‘ఎంకి చావు, సుబ్బు చావుకొచ్చింది’ అని కొత్త సామెత రాసుకోవాలి. అంతర్జాతీయంగా పెట్టుబడుల ప్రవాహాలకు గేట్లు తెరిచిన ‘ప్రపంచీకరణ’ విధానాలు ఆర్ధిక వ్యవస్ధలను అతలాకుతలం చేయగల శక్తిని సంతరించుకోగా, పులిని చూసి వాతలు పెట్టుకున్న నక్కల్లాగా షేర్ల వ్యాపారంలో అదృష్టం పరీక్షించుకుంటున్న మధ్యతరగతి జనం చివరకు దురదృష్ట జాతకులై తేలుతున్నారు. లేకపోతే అమెరికాలో రిపబ్లికన్-డెమోక్రటిక్ పార్టీల సిగపట్లు, ఇటలీలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న అవినీతి సామ్రాట్లు ఇండియా షేర్ మార్కెట్లను కుదేయడం ఏమిటి? సోమవారం బి.ఎస్.ఇ సెన్సెక్స్…

యూరో జోన్ ఆర్ధిక వ్యవస్ధ పైకి తేలిందా? -కార్టూన్

యూరోజోన్ ఎక్స్ ప్రెస్: గాస్ప్! (ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న శబ్దం) పీతలు: “పాపం! వాళ్లింకా ఒడ్డున పడనేలేదు” – ఐరోపా ఖండంలోని 28 దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్ (ఇ.యు) గా ఏర్పడగా అందులోని 17 దేశాలను యూరో జోన్ అని పిలుస్తారు. ఈ 17 దేశాలు తమ తమ జాతీయ కరెన్సీలను వదిలేసుకుని ఒకే కరెన్సీ ‘యూరో’ ఏర్పాటు చేసుకున్నాయి. యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) తప్ప మిగిలిన ప్రధాన దేశాలన్నీ యూరోజోన్ సభ్య దేశాలే.…

గ్రీసు రుణ సంక్షోభం: లెంపలు వేసుకున్న ఐ.ఎం.ఎఫ్

దేశాల ఆర్ధిక వ్యవస్ధల తప్పులను సవరించే బాధ్యతను తనకు తాను నెత్తిమీద వేసుకున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్ధ మొదటిసారిగా, పటాటోపానికే ఐనా, లెంపలు వేసుకుంది. గ్రీసు దేశ ప్రజలపై బలవంతంగా రుద్దిన పొదుపు విధానాలు ఎంతవరకు పని చేస్తాయన్న విషయమై తాము తప్పుడు అంచనాలు వేశామని అంగీకరించింది. అమెరికా, ఐరోపాల తరపున ప్రపంచ దేశాల మీద ద్రవ్య పెత్తనం సాగించే ఐ.ఎం.ఎఫ్, తాను తప్పు చేశానని ఒప్పుకోవడం అసాధారణం. అయితే, ఈ ఒప్పుకోలు వలన…

రికార్డు స్ధాయికి ఫ్రాన్స్ నిరుద్యోగం

ఐరోపాలో జర్మనీ తర్వాత హెవీ వెయిట్ గా పేరు పొందిన ఫ్రాన్స్ లో కూడా ప్రజలు నిరుద్యోగ భూతాన్ని ఎదుర్కొంటున్నారు. గత 15 సంవత్సరాలలోనే అత్యధిక స్ధాయికి అక్కడి నిరుద్యోగం చేరుకుంది. 2013 మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) ముగిసేనాటికి ఫ్రాన్స్ లో 10.8 శాతం నిరుద్యోగం నమోదయిందని ఆ దేశ జాతీయ గణాంకాల సంస్ధ INSEE గురువారం తెలిపింది. 1998 తర్వాత ఈ స్ధాయి నిరుద్యోగం నమోదు కావడం ఫ్రాన్స్ లో ఇదే మొదటిసారి.…