ప్రజాస్వామ్యానికి నిఖార్సయిన రోజు (అరుంధతీ రాయ్ రచన)

అవును కదా? నా ఉద్దేశం నిన్నటి రోజు అని. వసంతం ఢిల్లీలో తనను తాను ప్రకటించుకుంది. సూర్యుడు ఉదయించాడు, చట్టం తన పని తాను చేసుకుని పోయింది. బ్రేక్ ఫాస్ట్ కి కొద్దిసేపటి ముందు, 2001 నాటి పార్లమెంటు దాడి కేసులో ప్రధాన నిందితుడు అఫ్జల్ గురు రహస్యంగా ఉరితీయబడ్డాడు. అతని విగత దేహాన్ని తీహార్ జైలులోనే పూడ్చిపెట్టారు. మక్బూల్ భట్ కి పక్కనే ఆయనను పూడ్చిపెట్టారా? (1984లో ఉరి తీయబడిన మరో కాశ్మీరీ ఆయన. ఆయన…

అఫ్జల్ గురు ఉరితీత, ఢిల్లీలో కాశ్మీరీల ఆందోళనలు -ఫొటోలు

2001 సంవత్సరంలో పార్లమెంటుపై దాడి జరిపిన కేసులో అరెస్టు అయి అప్పటినుండి జైలులో మగ్గుతున్న అఫ్జల్ గురుకి కోర్టు విధించిన మరణ శిక్షను శనివారం ఉదయం అమలు చేసారు. అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడంతో ఆయనకు విధించిన ఉరి శిక్షను అమలు చేసామని ప్రభుత్వం ప్రకటించింది. రాజకీయ లబ్ది పొందడానికే ఈ సమయంలో ఆయనని ఎన్నికలముందు ఉరి తీసారన్న ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఉరి శిక్ష అమలుపై…