మనోరమ: చిత్రహింసలు పెట్టి చంపేశారు -కమిషన్

మణిపురి యువతి తంగ్జామ్ మనోరమ హత్యకు ఎవరు బాధ్యులో విచారించిన జ్యుడీషియల్ కమిషన్ నివేదిక ఎట్టకేలకు వెలుగు చూసింది. నివేదికను కమిషన్ వెల్లడి చేసిన దశాబ్దం తర్వాత, అది కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్నాకనే, అందులోని అంశాలు పాక్షికంగానైనా లోకానికి వెల్లడి అయ్యాయి. అస్సాం రైఫిల్స్ కు చెందిన సైనిక బృందం ఒకటి మనోరమ ఇంట్లో చొరబడి, ఆమెను లాక్కెళ్లి, చిత్రహింసలకు గురిచేసి, అనంతరం విచక్షణారహితంగా అనేకమార్లు తుపాకితో కాల్చి చంపారని కమిషన్ నివేదిక తెలిపింది.…