కాదేదీ రాజకీయాల కనర్హం! టీచర్స్ డే కూడా -కార్టూన్
A for Achche din… గతంలో ఎన్నడూ ఎవరూ పెద్దగా పట్టించుకోని ‘ఉపాధ్యాయ దినోత్సవం’ (సెప్టెంబర్ 5) ఈ సంవత్సరం ప్రధాని నరేంద్ర మోడి పుణ్యమాని ఓ పెద్ద చర్చాంశం అయింది. రాజకీయాలకు అతీతంగా నిస్పాక్షిక సంబరంగా ఇన్నాళ్లూ ఉంటూ వచ్చిన ఉపాధ్యాయ దినం ఇప్పుడు రాజకీయ ప్రకటనలకు వేదిక కావడమూ ప్రధాని మోడి పుణ్యమే. ‘చాయ్ పే చర్చా’ తరహాలో ప్రధాన మంత్రి స్వయంగా పిల్లలతో మాట్లాడుతారంటూ మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ…