కరువు.. మీకు పట్టదా కేంద్రం గారూ! -కత్తిరింపు

ఎల్ నినో కారణమో మరింకేం గాడిద కారణమో జనానికి అనవసరం. వారికి తెలిసింది వర్షాలు పడకపోవడమే. వర్షారాధార వ్యవసాయం సాగకపోవడమే. భారత దేశంలో వ్యవసాయం సాగకపోతే 75 శాతం జనం ప్రభావితులవుతారు. వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేసినట్లుగా ఖరీఫ్ వానలు (నైరుతి ఋతుపవనాలు) శీతకన్ను వేయడంతో అనేక రాష్ట్రాలు దుర్భిక్షంతో సతమతం అవుతున్నాయి. అందులో తెలుగు రాష్ట్రాలు రెండూ ఉన్నాయి. గొప్పకు పోయి, హిందూత్వ స్ఫూర్తితో మన రాష్ట్రాల పాలకులు నదీ జలాలని పుష్కర మాతకు సమర్పించుకున్నారు.…

2016 బడ్జెట్: రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా… -1

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక విచిత్రమైన బడ్జెట్ ప్రతిపాదించారు. దాదాపు ఎవరికీ ఏమీ అర్ధం కాకుండా పోయిన బడ్జెట్ ఇది. సారాంశాన్ని ఒక ముక్కలో చెప్పడానికి సాధారణ పరిశీలకులకు ఎవరికీ అవకాశం ఇవ్వకుండా బడ్జెట్ ప్రతిపాదించబడింది. చివరికి స్టాక్ మార్కెట్లు కూడా మొదట 600 పాయింట్లు పైగా పడిపోయి మళ్ళీ లేచి 153 పాయింట్ల నష్టంతో సర్దుకుంది. అనగా ధనిక పారిశ్రామిక వర్గాలకు కూడా బడ్జెట్ తనకు అనుకూలమో, ప్రతికూలమో ఒక పట్టాన అర్ధమై చావలేదు.…

అవాంఛనీయ ఉపసంహరణ -ది హిందు ఎడిటోరియల్

(లోక్ సభ ఎన్నికల్లో బి.జె.పి ప్రధాన నినాదాలు అభివృద్ధి, ఉపాధి. అధికారంలోకి వచ్చాక ఈ నినాదాలకు కట్టుబడి ఉండడానికి బదులు సరిగ్గా వ్యతిరేక చర్యలను బి.జె.పి ప్రభుత్వం తలపెడుతోంది. మిలియన్ల మంది గ్రామీణ పేదలకు కాస్తో, కూస్తో వరంగా పరిణమించిన గ్రామీణ ఉపాధి పధకంలో కోత విధించడం ద్వారా మోడి ప్రభుత్వం తన హామీని అడ్డంగా ఉల్లంఘిస్తోంది. ఈ అంశంపై ఈ రోజు హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం ఇది. -విశేఖర్) ప్రపంచంలో అతి…

ఉపాధి హామీ పధకం ఛారిటీ, దాన్ని ఆపాలి -మోడి

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తాను కప్పుకున్న ఒక్కో ముసుగూ విప్పి పారేస్తున్నారు. తాను వ్యాపారులు, కంపెనీల పక్షమే కానీ ప్రజల పక్షం కాదని చక్కగా చెప్పుకుంటున్నారు. తన గురించి పట్టించుకోవాల్సిన అంశం మతోన్మాదం కాదనీ, తన పక్కా ప్రజా వ్యతిరేక విధానాలే అనీ జనానికి గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ‘మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం’ ఛారిటీ పధకం అనీ, ఓట్ల కోసం ఉద్దేశించిన అలాంటి పధకాలు తనకు ఇష్టం లేదనీ…

కనీస వేతనాలకు ప్రధాన మంత్రే అడ్డం!

భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెబుతుంటారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దేశం లోపలా, బయటా తనకు అవసరం అనిపించినప్పుడల్లా ఆ సంగతి చెప్పుకుని మురిసిపోతుంటారు. ప్రజల ఓట్లతో అధికారం సంపాదించాక కనీసంగానైనా జనం గురించి పట్టించుకోకపోతారా అని సాధారణంగా మనమూ అనుకుంటాం. కానీ ఉపాధి హామీ పధకం కింద పని చేస్తున్న కూలీలకు కనీస వేతనం చెల్లించడానికి ప్రధానమంత్రి, ఆయన కార్యాలయమే సైంధవుడిలా అడ్డు పడుతున్న సంగతి వెలుగులోకి వచ్చింది. కర్ణాటక హై…

Agri labour

‘ఉపాధి హామీ పధకం’ కి బడ్జెట్ లో నిధుల కత్తిరింపు

ఓట్ల కోసమే తప్ప తమకు ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రుజువు చేసుకుంది. ప్రజా సంక్షేమం చూసే పార్టీగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రముఖంగా చూపించే పధకం ‘ఉపాధి హామీ పధకం’. ఈ పధకం వల్లనే కాంగ్రెస్ పార్టీ రెండవ సారి వరుసగా అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు అనేకసార్లు చెప్పారు. దీనిని సోనియా గాంధీ ప్రసాదించిన వరంగా కూడా కాంగ్రెస్ పెద్దలు చెప్పుకోవడం కద్దు. అలాంటి పధకానికి 2012-13 ఆర్ధిక సంవత్సరానికి ప్రతిపాదించిన…