నాకు తెలియని ఉదయభాను
ఈ పాట నిన్నే విన్నాను (చూశాను). ఉదయభాను తన అమ్మగారితో కలిసి ఈ పాట రాశారట. పాట రాయడం అటుంచి ఆమె పాడతారని కూడా నాకు తెలియదు. ‘నేను గతంలో చాలాసార్లు పాడాను’ అంటున్న ఆమెను చూసి ‘నిజమా’ అనుకుని హాశ్చర్యపోయేసి అందులోంచి తేరుకునే లోపు ఆమె పాడడం కూడా మొదలుపెట్టారు. పాట ఒక్కోపాదం వినేకొద్దీ నా ఆశ్చర్యం అవధులు దాటింది. మధ్యలో తెలంగాణ యాసలో ఉన్న కొన్ని పదాలు తప్ప చాలావరకు పాట అర్ధం అయింది.…