పాక్ పాఠశాలపై ఉగ్ర దాడి, 84 మంది పిల్లలు బలి -ఫోటోలు

పాకిస్ధాన్ కు చెందిన తాలిబాన్ శాఖ తెహ్రీక్-ఏ-తాలిబాన్ పెషావర్ పట్టణంలో పరమ హీనమైన దాడికి పాల్పడింది. అమెరికాలో మాత్రమే కనిపించే ఉగ్రవాద తరహా దాడికి పాక్ తాలిబాన్ తెగబడింది. పాఠశాలపై తుపాకులతో దాడి చేసి అభం శుభం ఎరుగని పసి పిల్లలను కాల్చి చంపే ఉన్మత్త ఘటనలు ఇప్పటిదాకా అమెరికాకు మాత్రమే పరిమితం. అలాంటి దాడి పాకిస్ధాన్ లో చోటు చేసుకుంది. 6గురు తాలిబాన్ ఆత్మాహుతి కార్యకర్తలు జరిపిన దాడిలో 126 మంది చనిపోగా వారిలో 84…

సి.ఐ.ఏపై కేసుకు పాక్ కోర్టు ఆదేశం

పాకిస్తాన్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. పాక్ లో పని చేసి వెళ్ళిన సి.ఐ.ఏ మాజీ అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని ఇస్లామాబాద్ హై కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. డ్రోన్ దాడుల ద్వారా హత్య, కుట్ర, దేశంపై యుద్ధం ప్రకటించడం తదితర నేరాలకు పాల్పడినందుకు గాను వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టాలని కోర్టు ఆదేశించింది. అమెరికన్ డ్రోన్ దాడుల్లో తన కొడుకును కోల్పోయిన ఉత్తర వజీరిస్తాన్ పౌరుడొకరు చేసిన…