ఉత్తరఖండ్ వరదలు: పాఠాలు నేర్చేదే లేదు!

ఉత్తర ఖండ్ లో 4 రోజుల పాటు కురిసిన అతి భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగి పోర్లాయి. ఎప్పటిలాగే పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా నీట మునిగాయి. వంతెనలు తెగిపోయాయి. కొన్ని చోట్ల అవి కూలిపోయి కొట్టుకుపోయాయి. కడపటి వార్తలు అందేసరికి  52 మంది మరణించారు. కొండల మీద నుండి రాళ్ళు, భారీ మట్టి పెళ్ళలు జారిపడి రోడ్లను కప్పేసాయి. కొండ చరియలు విరిగిపడి రోడ్డు మార్గాలను తెంపేశాయి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వరదల…

అమెరికన్ ఉత్తరాఖండ్? కనీవినీ ఎరగని కొలరాడో వరదలు -ఫోటోలు

మెరుపులాంటి ఉధృతితో వానలు కురిస్తే, అందునా కొండల వెంబడి బండలను కిందికి తోసుకుంటూ పోయే ప్రవాహాల్ని సృష్టించే వానలు కురిస్తే ఆ ఉత్పాతం ఎలాంటిదో ఉత్తరాఖండ్ వరదలు మనకి రుచి చూపించాయి. సరిగ్గా అదే నైసర్గిక స్వరూపం కలిగి ఉన్న కొలరాడో రాష్ట్రంలో వారం రోజుల పాటు కురిసిన వానలు కనీవినీ ఎరుగని మహోత్పాతాన్ని సృష్టించాయి. ఎప్పటిలానే కొలరాడో వరదలకు కూడా గ్లోబల్ వార్మింగే కారణం అని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. కొలరాడో వరదల్లో ఇప్పటివరకూ 6గురు చనిపోయారని…

ఉత్తరఖండ్, బుద్ధగయ మరియు జోకర్ వి.ఐ.పిలు -కార్టూన్

ఉత్తరఖండ్ హిమాలయ విలయం నుండి దేశం ఇంకా తేరుకోనే లేదు. అక్కడింకా శవాల లెక్కలు తేలలేదు. మందాకిని పూడ్చిన గ్రామాలు, పొలాలు పైకి లేవలేదు. విగతులైనవారి అంత్యక్రియలు సైతం పూర్తి కాలేదు. ఇంతలోనే బుద్ధగయ మానవ విధ్వంసం! దేశానికి ప్రకృతి విలయాలు కొత్త కాకపోవచ్చు. ఆ మాటకొస్తే ఉగ్రవాద బాంబు పేలుళ్లు కూడా కొత్త కాదు. కానీ రాజకీయ నాయకులకు, వి.ఐ.పి లకు అవి ఎప్పటికప్పుడు భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అక్కరకు వచ్చే నిత్య నూతన సాధనాలు. ప్రకృతి…

ఉత్తర ఖండ్ మరణాలు పదివేలు?

ఉత్తర ఖండ్ జల ప్రళయం మరణాలు పదివేలకు పైనే ఉంటాయని ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మరణాలు ఐదు వేలకు పైనే ఉండొచ్చని అంచనా వేసిన గోవింద్ సింగ్, ఇప్పుడా సంఖ్యను రెట్టింపు చేశారు. గల్లంతయిన వారి సంఖ్య గురించి గ్రామాల నుండి తనకు అందుతున్న సమాచారం ప్రకారం మరణాలు పదివేలకు పైనే ఉండవచ్చని రూఢి అవుతోందని ఆయన తెలిపారు. అయితే ముఖ్యమంత్రి విజయ్…

కేదార్ నాధ్ లో ఏం జరిగింది? -వీడియో

కేదార్ నాధ్ ను ముంచెత్తిన జల ప్రళయం ఎలా జరిగి ఉండవచ్చో ఊహిస్తూ నిపుణులు ఒక వీడియో రూపొందించారు. ఆ వీడియోను హెడ్ లైన్స్ టుడే పత్రిక తన వెబ్ సైట్ లో పబ్లిష్ చేయగా యాహూ న్యూస్ షేర్ చేసింది. వీడియోను ఈ బ్లాగ్ లో పబ్లిష్ చేసే మార్గం దొరకలేదు. అందువలన లింక్ మాత్రమే ఇస్తున్నాను.  వీడియోను ‘ఎందుకో ఏమో?’ గారు కింద వ్యాఖ్య ద్వారా అందించారు. కాబట్టి లింక్ ను తొలగించి వీడియో…

ఉత్తర ఖండ్ వరదలు: తెలుగు దేశం ఖాతాలో క్రెడిట్స్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందుగానే స్పందించడం ద్వారా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం, వరద బాధితుల అభిమానం చూరగొన్నట్లు కనిపిస్తోంది. పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళ్ళి తెలియని చోట, తెలియని భాష మధ్య, తెలియని మనుషుల మధ్య పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్న బాధితులకు కాసింత పలకరించే దిక్కు కనపడినా కొండంత ధైర్యం, నమ్మకం తెచ్చుకుంటారు. ఆ పని చేయడం ద్వారా తెలుగు దేశం పార్టీ తన పూర్వ వైభవం తెచ్చుకోవడంలో కొంత సఫలం…

ఉత్తర ఖండ్ కాదిది, మీ రాష్ట్రమే! -కార్టూన్

– నాయకుడు: దారుణం! నా హృదయం ఈ అభాగ్యుల కోసం విలపిస్తోంది… పైలట్: ఇది మీ సొంత రాష్ట్రమే సార్, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల మనం వెనక్కి వచ్చేశాం! ———000——— ఉత్తర ఖండ్ రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతిలో సంభవించిన మేఘ ప్రళయం (cloud bursts), హఠాత్ వరదల (flash floods) ను సృష్టించింది. ఈ వరదల్లో అనేకమంది తప్పించుకోవడానికి కూడా తగిన వీలు, సమయం లేక అసువులు బాసారు. ఇప్పటివరకు 800 చిల్లర…

రుద్ర భూమిపై రాజకీయ హెలికాప్టర్లు -కార్టూన్

శైవ క్షేత్రాలకు కేంద్రమైన ఉత్తర ఖండ్ ను రుద్ర భూమిగా చెప్పవచ్చు. ఆ రుద్ర భూమి రౌద్ర రూపం దాల్చిన క్షణాలు భక్తజన సమూహానికి శాపంగా మారగా, రాజకీయ నాయకులకు మాత్రం ఓట్ల గాలం కావడం అత్యంత శోచనీయం. ముఖ్యమంత్రులు ఏరియల్ సర్వేలలో నిమగ్నమై తమ తమ రాష్ట్ర వాసుల మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తూ బాధిత ప్రజలకు సాయం చేస్తున్న సైనికుల పనిని కష్టతరం చేస్తున్నారు. హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే వారిస్తున్నా వినకుండా ఉత్తర…

2 కోట్లు విదిల్చి రాంబో గొప్పలేల మోడి సారు?

134 మంది పట్టే విమానంలో రెండు రోజుల్లో 15,000 మంది గుజరాతీ యాత్రీకులను నరేంద్ర మోడి రక్షించారట! గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి గారు స్వయంగా ఈ విషయం చెప్పుకుంటూ అప్పుడే ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. ఎన్నికల ప్రచారానికి 5,000 మందికి పైగా హిందూ భక్తులు దుర్మరణం చెందినట్లు భయపడుతున్న కేదార్ నాధ్ వరద భీభత్సం కంటే మించిన సదవకాశం నరేంద్ర మోడి గారికి దొరక్కపోవడం అత్యంత అమానుషం కాగా, సాధ్యా సాధ్యాలు పరిశీలించకుండానే మోడీ భక్తాగ్రేసరులు…

ఉత్తరఖండ్ వరదలు: స్వయంకృత మహా విధ్వంసం -ఫోటోలు

ఉత్తర ఖండ్ రాష్ట్రంలో వారం రోజుల క్రితం ఉన్న పళంగా ఊడిపడిన వరదల్లో మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పటిదాకా 556 మృత దేశాలను లెక్కించిన అధికారులు వీరి సంఖ్య ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. సైన్యం రంగంలోకి దిగి ఇప్పటివరకు 73,000 మందిని రక్షించినప్పటికీ వివిధ చోట్ల నీటి తటాకాల మధ్య, రోడ్లు కూలిపోయినందు వల్లా ఇంకా 40,000 మంది ఎటువంటి సాయమూ అందక ఇరుక్కొనిపోయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పర్యావరణ పరంగా అత్యంత…