ఉత్తర కొరియాపై సామ్రాజ్యవాద యుద్ధ మేఘాలు?!

గత కొద్ది నెలలుగా అంతర్జాతీయ వార్తల్లో ఉత్తర కొరియా ఒక ప్రధాన అంశంగా వార్తల్లో నానుతోంది. ఈ వార్తలను ప్రధానంగా సృష్టిస్తున్నది అమెరికా, ఐరోపాలకు చెందిన బహుళజాతి కార్పొరేట్ మీడియా కంపెనీలు. కాగా ఇండియాతో సహా ఇతర మూడో ప్రపంచ దేశాలలోని చిన్నా, పెద్దా వార్తా సంస్థలన్నీ ఈ వార్తా కధనాలను క్రమం తప్పకుండా మోసి పెడుతున్నాయి. వాస్తవాల జోలికి పోకుండా అవాస్తవాలనే వాస్తవాలుగా నెత్తి మీద వేసుకుని ప్రచారం చేస్తున్నాయి. భారత దేశంలో అయితే ప్రాంతీయ…

అమెరికా ఒత్తిడి: మోడి వినాశకర ఉ.కొ విధానం

విదేశీ విధానంలో వరుస తప్పిదాలకు పాల్పడుతున్న మోడి ప్రభుత్వం ఉత్తర కొరియా విషయంలోనూ అదే ధోరణిలో వెళుతోంది. మోడి అనుసరిస్తున్న ఉత్తర కొరియా విధానంలో అమెరికా ఒత్తిడి ప్రధాన పాత్ర పోషించడం గమనించవలసిన సంగతి. అనగా అమెరికా ఒత్తిడితోనే మోడి నేతృత్వం లోని భారత పాలకవర్గాలు తమ అలీన ముసుగును చించేసుకుని పచ్చిగా బలహీన-వర్ధమాన దేశాలకు వ్యతిరేకంగా విదేశీ విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నాయి. ఇది ప్రపంచం లోని శ్రామిక ప్రజలతో పాటు భారత దేశ శ్రామిక…

అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలతో కొరియాల వద్ద ఉద్రిక్తతలు

ఉభయ కొరియాల వద్ద అమెరికా సాగిస్తున్న ‘మిలట్రీ డ్రిల్’ (కోడ్ నేమ్ ఫోల్ ఈగిల్) ఉద్రిక్తతలు రెచ్చగొడుతోంది. మున్నెన్నడూ లేని విధంగా అణు బాంబులు జారవిడిచే బి-2 బాంబర్ యుద్ధ విమానాలను కొరియా భూభాగంపై ఎగరడంతో ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. కొరియా భూభాగంపై 10,000 కి.మీ ఎత్తు ఎగురుతూ బి-2 బాంబర్లు ‘మాక్ బాంబింగ్’ డ్రిల్ (పేలుడు పదార్ధాలు లేని బాంబు జారవిడిచి అది అనుకున్న చోట పడేదీ, లేనిదీ నిర్ధారించుకోవడం) నిర్వహించడంతో ఉత్తర కొరియా…

యుద్ధం రీత్యా ఎంబసీలు ఖాళీ చేయాల్సి రావచ్చు -ఉత్తర కొరియా

ఉత్తర కొరియా, అమెరికాలు పరస్పర హెచ్చరికలతో ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో గువామ్ లో ఉన్న తమ సైనిక స్ధావారానికి అదనంగా రెండు క్షిపణి విచ్ఛేదక వ్యవస్ధలను అమెరికా గురువారం నాడు చేరవేసింది. దక్షిణ కొరియా ఆధునిక డిస్ట్రాయర్ యుద్ధ పరికరాలను ఉత్తర కొరియా సరిహద్దుకు శుక్రవారం తరలించింది. ఈ నేపధ్యంలో ఉత్తర కొరియాలోని విదేశీ రాయబారులు తమ తమ ఎంబసీలను ఖాళీ చేయాల్సి రావచ్చని ఏప్రిల్ 10 తర్వాత వారికి రక్షణ ఇవ్వడం తమకు…

ఉభయ కొరియాల వద్ద యుద్ధ పరిస్ధితులు

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దక్షిణ కొరియా, అమెరికాలు మళ్ళీ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టడంతో ఉత్తర కొరియా తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. గతంలో ఎన్నడూ లేనట్లుగా అమెరికా బి-2 బాంబర్లు కొరియా గగనతలం పైన ఎగరడంతో ఉత్తర కొరియా కలవరపాటుకు గురవుతోంది. ఆ దేశ అత్యున్నత మిలట్రీ కమాండ్ అత్యవసర సమావేశం జరిపి అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఖండాంతర క్షిపణులను అప్రమత్త స్థాయికి చేర్చుతున్నట్లు ప్రకటించింది. అమెరికా భూభాగం…

ఉత్తర కొరియాలో మేము గూఢచర్యం చేస్తున్నాం -అమెరికా మిలట్రీ

ఉత్తర కొరియాలో తాము గూఢచర్యం నిర్వహిస్తున్నామని అమెరికా మిలట్రీ అధికారి ఒకరు అంగీకరించాడు. దక్షిణ కొరియా ప్రత్యేక బలగాలతో కలిసి తాము ఉత్తర కొరియా మిలట్రీ వ్యవస్ధలు కనిపెట్టడానికి గూఢచర్యం నిర్వహించామని తెలిపాడు. పారాచూట్ల ద్వారా ఉత్తర కొరియాలో దిగి అండర్ గ్రౌండ్ లో దాగిన మిలట్రీ వ్యవస్ధలపై సమాచారం సేకరించామని అమెరికా అధికారి చెప్పినట్లు ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. దక్షిణ కొరియాలో అమెరికా సైనిక స్ధావరాలున్నాయి. దక్షిణ కొరియాలో ‘స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్’ కమాండర్…

అణు సాంకేతిక పరిజ్ఞానం కోసం పాక్ మిలట్రీ అధికారులకు లంచం చెల్లించిన ఉత్తర కొరియా

పాకిస్ధాన్‌కు అణుశాస్త్ర, అణ్వస్త్ర పితామహుడుగా పేరుపొందిన అబ్దుల్ ఖదీర్ ఖాన్ పాక్ మిలట్రీ పరువు తీస్తూ అణుబాంబు పేల్చినంత పని చేశాడు. పాకిస్ధాన్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉత్తర కొరియాకు అణు సాంకేతిక పరిజ్ఞాన్ని ఉత్తర కొరియాకు బదలాయించాడని పాక్ ప్రభుత్వం ఖదీర్ ఖాన్‌పై ఇప్పటివరకూ ఆరోపిస్తూ వచ్చింది. ఆ అరోపణలకు భిన్నంగా అణు సాంకేతికత బదలాయింపులో పాక్ మిలట్రీకే నేరుగా సంబంధం ఉందనీ, అందుకు మిలట్రీ అధికారి ఒకరు 3 మిలియన్ డాలర్లు, మరొక అధికారి…